ఎస్‌బీఐ షాకిచ్చిందిగా.. రేపటినుంచే అమలు

14 Mar, 2023 17:01 IST|Sakshi

సాక్షి,ముంబై:  ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజంస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. తన బేస్‌ రేట్‌, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్లను పెంచింది. బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్‌ఆర్‌)ని 70 బేసిస్ పాయింట్లు లేదా 0.7 శాతం పెంచింది. దీంతో బీపీఎల్‌ఆర్‌ రేటు 14.85 శాతానికి చేరింది. అలాగే పబ్లిక్ లెండర్ కూడా బేస్ రేటును 9.40 శాతం నుండి 10.10 శాతానికి పెంచింది.

రేపటి(మార్చి15) నుంచి సవరించిన రేట్లు అమల్లోకి రానున్నాయి. దీంతో ఎస్సీబీలో రుణాలు తీసుకున్న వినియోగ దారుల నెలవారీ ఈఎంఐ పెరగనున్నాయి. అన్ని రుణాలకు వర్తించే కనీస రేటునే బేస్‌ రేటు అంటారు. అంటే నిర్ణయించిన రేటు కంటే తక్కువకు రుణాలివ్వడానికి వీలుండదు. ఇక బీపీఎల్‌ఆర్‌ అనేది బేస్‌ రేటుకు ముందున్న రుణాలకు మాత్రమే వర్తించే రేటు.  అయితే ఫండ్స్ ఆధారిత రుణ రేట్ల మార్జినల్  రేటు యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. ఇది గృహ రుణాల రేటుపై ప్రభావం చూపదని తెలిపింది. ఎంసీఎల్‌ఆర్‌ అంటే బ్యాంకు ఖాతాదారులకు రుణాలు ఇచ్చే రేటు.

కాగా  ఫిబ్రవరి 15, 2023న 10 బేసిస్ పాయింట్లు లేదా 0.1 శాతం పెంచింది. దీని ప్రకారం ఒక సంవత్సరం రుణాలు, రెండేళ్ల,మూడేళ్ల రుణాలకు వర్తించే వడ్డీ రేట్లు వరుసగా 8.50 శాతం, 8.60 శాతం మరియు 8.70 శాతంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేక్రమంలో ఆర్బీఐ తన తాజా( ఫిబ్రవరి 8) నాటి పాలసీ రివ్యూలోరెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి పెంచింది. 
 

మరిన్ని వార్తలు