ఎఫ్‌డీ వడ్డీ రేట్లను పెంచిన ఎస్​బీఐ.. ఎంతంటే?

11 Mar, 2022 21:14 IST|Sakshi

ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ) తన ఎఫ్‌డీ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)పై చెల్లించే వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు బ్యాంకు ప్రకటించింది. రూ.2 కోట్ల కంటే ఎక్కువ గల బల్క్ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 20 నుంచి 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఎస్​బీఐ తన ప్రకటనలో పేర్కొంది. పెంచిన కొత్త వడ్డీ రేట్లు మార్చి 10, 2022 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.

ఎస్​బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రూ.2 కోట్లకు కంటే ఎక్కువ పెట్టుబడి, 211 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ వ్యవధి గల ఎఫ్‌డీ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లను పెంచింది. వడ్డీ రేట్లను పెంచడం వల్ల  మార్చి 10 నుంచి ఎఫ్‌డీలపై 3.30 శాతం వడ్డీ లభించనుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు ఈ ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 3.60 శాతం నుంచి 3.80 శాతానికి పెరిగింది. ఏడాది నుంచి పదేళ్ల టెన్యూర్ కలిగిన బల్క్ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను ఎస్​బీఐ 50 బేసిస్ పాయింట్లు పెంచింది.

దీంతో వడ్డీ రేట్లు 3.10 శాతం నుంచి 3.60 శాతానికి చేరనుంది. అలాగే, ఈ ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లు 4.10 శాతం వరకు వడ్డీని పొందవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. సమీక్షించిన ఈ వడ్డీ రేట్లు కొత్త డిపాజిట్లకు, రెన్యూవల్ అయ్యే డిపాజిట్లకు వర్తిస్తున్నాయి. 

(చదవండి: పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకుకు షాక్ ఇచ్చిన ఆర్‌బీఐ)

మరిన్ని వార్తలు