ఈ క్రెడిట్‌ కార్డ్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌!

26 Dec, 2022 18:59 IST|Sakshi

ప్రముఖ క్రెడిట్ కార్డ్ జారీచేసే సంస్థలు ఎస్‌బీఐ (SBI), ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్, (Axis)యాక్సిస్ బ్యాంక్ వ‌చ్చే ఏడాది మార్చి నాటికి `యూపీఐ` సేవ‌లు అందుబాటులోకి తీసుకురానున్నాయి. దీంతో డిజిట‌ల్ పేమెంట్స్ సేవ‌ల వినియోగానికి యూజ‌ర్ల‌కు అద‌న‌పు వెసులుబాటు ల‌భించనుంది. ఇటీవ‌ల నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) `రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ` ఫీచ‌ర్‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం దీని కింద రోజుకు రూ.50 ల‌క్ష‌ల విలువైన లావాదేవీలు జ‌రుగుతున్నాయని ఎన్‌పీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  తెలిపారు.

ప్రస్తుతం మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ప్రైవేట్ రంగ బ్యాంక్ హెడీఎఫ్‌సీ బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డ్ విభాగంలో తన కస్టమర్లు ఈ సేవలను అందిస్తున్నాయి. గ‌త జూన్‌లో యూపీఐ సేవ‌ల‌తో క్రెడిట్ కార్డుల‌ను `పే నౌ` ఫెసిలిటీ కింద లింక్ చేసేందుకు ఆర్బీఐ అనుమ‌తించింది. ప్ర‌స్తుతం రోజువారీగా రూ.50 ల‌క్ష‌ల విలువైన లావాదేవీలు న‌మోద‌వుతుండగా, భవిష్యత్తులో ఇత‌ర అతిపెద్ద క్రెడిట్ జారీ సంస్థ‌లు యూపీఐ సేవ‌ల‌ను అందుబాటులోకి తేవడం ద్వారా లావాదేవీలు మ‌రింత పెరుగనున్నాయి. యూపీఐ లావాదేవీలపై రూ.2000 వ‌ర‌కు రూపే క్రెడిట్ కార్డుల వినియోగంపై అద‌న‌పు చార్జీల‌ను తొల‌గిస్తూ ఇటీవలే ఎన్పీసీఐ మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.

చదవండి: ఈ కేంద్ర పథకం గురించి మీకు తెలుసా.. ఇలా చేస్తే రూ.15 లక్షలు వస్తాయ్‌!

మరిన్ని వార్తలు