State Bank of India: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త!

10 May, 2022 15:02 IST|Sakshi

SBI Hikes Interest Rates On Fixed Deposits: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త. ప్రముఖ బ్యాంకింగ్‌ రంగ సంస్థ ఎస్‌బీఐ బ్యాంక్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన ఈ వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి రానుండగా...రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో ఉన్న డిపాజిట్లకు మాత్రమే ఈ వడ్డీరేట్లు వర్తించనున్నాయని అధికారులు తెలిపారు.  

7 నుంచి 45 రోజుల వ్యవధి మినహాయించి మిగిలిన టెన్యూర్‌ వడ్డీరేట్లను పెంచింది. దీంతో 46 రోజుల నుంచి 179 రోజుల టెన్యూర్‌లో 3శాతం ఉన్న వడ్డీ రేటు 3.50శాతం, 180 నుంచి 210 టెన్యూర్‌లో 3.10 నుంచి 3.50శాతం వరకు పెరిగాయి.

సంవత్సరం కంటే తక్కువ అంటే 211 రోజుల టెన్యూర్‌లో 3.30 శాతం నుంచి 3.75శాతం వరకు 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల టెన్యూర్‌లో 3.60 నుంచి 4శాతం, 2 సంవత్సరాల నుంచి 3సంవత్సరాల లోపు టెన్యూర్‌లో 3.6శాతం నుంచి 4.25శాతం, మూడు నుంచి 5 సంవత్సరాల లోపు టెన్యూర్‌లో 4.50 శాతం వరకు, 5ఏళ్ల నుంచి 10 టెన్యూర్‌ వరకు 4.50శాతం వరకు పెరిగాయి. 

సీనియర్‌ సిటిజన్లకు 
సీనియర్‌ సిటిజన్ల పిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. 7 నుంచి 45 రోజుల టెన్యూర్‌ను మినహాయించింది. 46 నుంచి 179 రోజుల టెన్యూర్‌లో 3.5శాతం నుంచి 4శాతానికి, 180 రోజుల నుంచి 210 రోజుల టెన్యూర్‌లో 3.6శాతం నుంచి 4శాతానికి పెంచింది. 

ఒక సంవత్సరం కంటే తక్కువ అంటే 211 రోజుల టెన్యూర్‌లో 3.80శాతం నుంచి 4.25 శాతానికి, ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు టెన్యూర్‌లో  4.1 శాతం నుంచి 4.5శాతం వరకు, 2 సంత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు టెన్యూర్‌లో 4.1 నుంచి 4.75శాతం వరకు, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు టెన్యూర్‌లో 4.1 నుంచి 5శాతం , 5 సంవత్సరాల నుంచి 10ఏళ్ల టెన్యూర్‌లో 4.1 శాతం నుంచి 5శాతానికి వడ్డీ రేట్లు పెంచుతూ తాజాగా ఎస్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

చదవండి👉వందల కోట్లే..ఎస్‌బీఐ కార్డ్స్‌కు పెరిగిన లాభం!

మరిన్ని వార్తలు