ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్..!

21 Jan, 2022 17:56 IST|Sakshi

భారతదేశపు అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వినియోగదారులను అలర్ట్ చేసింది. టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లో భాగంగా ఎస్‌బీఐ బ్యాంకుకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్‌, యోనో, యోనో లైట్‌, యూపీఐ సేవలను జనవరి 22న నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సేవలు రేపు ఉదయం 02:00 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఎటువంటి సేవలు పనిచేయవు అని తన ట్విటర్ ఖాతా వేదికగా పేర్కొంది. 

"మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నాము అని, ఈ ఒక్క రోజు పాటు తమకు సహకరించగలరని" ఎస్‌బీఐ అభ్యర్థించింది. ఎస్‌బీఐ తాత్కాలికంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను బంద్ చేయడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు కూడా చాలా సార్లు మెయింటనెన్స్ చేపట్టింది. యూజర్లకు మరింత సురక్షితమైన సేవలను అందించేందుకు ఎస్‌బీఐ గత కొంత కాలంగా మెయింటనెన్స్ వర్క్ చేపడుతూ వస్తుంది. దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ కలిగిన ఎస్‌బీఐకి 22 వేలకు పైగా బ్రాంచులున్నాయి. దేశవ్యాప్తంగా 57,889కి పైగా ఏటీఎంలున్నాయి.

(చదవండి: కరోనా కాలంలో అమ్మకాల్లో డోలో 650 టాబ్లెట్ రికార్డు..!)

మరిన్ని వార్తలు