ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్!

20 Mar, 2022 19:14 IST|Sakshi

ఎస్‌బీఐ తన ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. తమ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించే బ్యాంక్‌ సిస్టమ్‌ను అప్‌డేట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలను ఉపయోగించుకునే వారికి మరిన్ని ఫీచర్లు జోడించేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మార్చి 20న రాత్రి 11:30 గంటల నుంచి మార్చి 21 2:00 గంటల మధ్య కాలంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ టెక్నాలజీని అప్‌డేట్‌ చేస్తున్నట్లు ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. 

ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో సిస్టమ్‌ను అప్‌డేట్‌ చేస్తోంది. ఈ కారణంగా రేపు రెండున్నర గంటలపాటు బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం కలగనుంది. ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌/యోనో/యోనో లైట్‌ సేవలు ఈ రెండున్నర గంటల పాటు అందుబాటులో ఉండవని ఎస్‌బీఐ తెలిపింది. ఖాతాదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఖాతాదారులు గుర్తించాలని ట్వీట్ చేశారు. మరి ఈ సమయాల్లో ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ చేసేవారు ముందుగానే జాగ్రత్త పడండి.

(చదవండి: రూ.53 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఓలా కంటే ఎక్కువ రేంజ్!)


 

మరిన్ని వార్తలు