SBI:ఖాతాదారులకు ముఖ్య గమనిక

3 Jul, 2021 15:08 IST|Sakshi

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు కీలక సూచనలు చేసింది. ఆదివారం జులై 4 న రోజున ఉదయం 3.25am గంటల నుంచి 5.50am వరకు  డిజిటల్ లావాదేవీలు నిలిచిపోనున్నాయి. దీంతో ఖాతాదారులకు  డిజిటల్ సేవల  నిర్వహణకు ఆటంకం ఏర్పడనుంది. ఎస్బీఐ తమ సేవలను అప్ గ్రేడ్ చేసే క్రమంలో డిజిటల్ సేవలు నిలిచిపోనున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యూపీఐ తదితర సేవలకు  అంతరాయం ఏర్పడనుంది.

ఎస్బీఐ జూలై ఒకటి నుంచి కొత్త నిబందనలను అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎటిఎమ్ నుంచి నగదు విత్ డ్రా, బ్రాంచీ నుంచి నగదు విత్ డ్రా, చెక్ బుక్ వంటి అంశాలకు సంబంధించిన చార్జీల విషయంలో మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ కేవలం బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్ బీడి) ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయి.


 

మరిన్ని వార్తలు