అలర్ట్‌: యోనో యాప్‌ వినియోగిస్తున్నారా?! ఇది మీకోసమే

28 Jul, 2021 12:35 IST|Sakshi

కరోనా కారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) యాప్‌ యోనోలో ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్లు విపరీతంగా పెరిగాయి. అయితే ఆన్‌ లైన్‌ ట్రాన్సాక్షన‍్లను పెంచి, వినియోగదారుల అకౌంట్లను సురక్షితంగా ఉంచేందుకు ఎస్‌బీఐ యోనో యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు చేస్తుంది.తాజాగా వినియోగదారుల భద్రతే లక్ష్యంగా యోనోలైట్‌ యాప్‌లో  'సిమ్‌ బైండింగ్‌' ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.   

'ఇప్పుడు ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ గతంలో కంటే మరింత సురక్షితం! సరికొత్త యోనో లైట్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి' అంటూ ఎస్‌బీఐ ట్వీట్‌ చేసింది. సిమ్ బైండింగ్ ఫీచర్‌ వల్ల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తో ఒక యూజర్‌కి మాత్రమే అనుమతి ఉంది. యూజర్లు రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌తో కాకుండా వేరే  నెంబర్‌ను ఉపయోగించి లాగిన్ చేసి లావాదేవీలను నిర్వహించేందుకు అనుమతి లేదు. 
 
యోనో లైట్ యాప్‌లో రిజిస్ట్రర్‌ మొబైల్‌ నెంబర్‌ను ఎలా యాడ్‌ చేయాలో తెలుసుకుందాం

ఆండ్రాయిడ్ యూజర్లు ప్లే స్టోర్ నుండి ఎస్‌బీఐ  యోనో లైట్ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకోవాలి
యాప్‌ ఓపెన్‌ చేసిన తరువాత ఎస్‌బిఐలో  సిమ్ 1 లేదా సిమ్ 2 ఆప్షన్‌ ని ఎంచుకోవాలి. ఒకే సిమ్‌ ఉంటే సిమ్‌ సెలక్షన్‌ అవసరం లేదు. 
అనంతరం మొబైల్ నంబర్ కన్ఫాం కోసం ఓటీపీ అడుగుతుంది. 
ఓటీపీ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే మీ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది
ఓటీపీని ఎంటర్‌ చేసి రిజిస్ట్రేషన్ ఆప్షన్‌లో మీ ఐడీ, పాస్‌ వర్డ్‌ ను ఎంటర్‌ చేసి రిజిస్టర్‌ అని క్లిక్‌ చేయాలి. 
అనంతరం కండీషన్స్‌కు ఓకే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.  
దీంతో మరో సారి మీ నెంబర్‌కు యాక్టివేషన్‌  ఓటీపీ వస్తుంది. 
ఆ ఓటీపీని ఎంటర్‌ చేసి యోనోలైట్‌ యాప్‌ను వినియోగించుకోవచ్చు.  

చదవండిCryptocurrency: మేం ఎవరి డేటా కలెక్ట్‌ చేయడం లేదు

మరిన్ని వార్తలు