SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు హెచ్చరిక..! వాటితో జాగ్రత్త..!

22 Nov, 2021 21:15 IST|Sakshi

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాదారులను హెచ్చరించింది. ఎస్‌బీఐకు చెందిన కస్టమర్‌ కేర్‌ నంబర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఖాతాదారులకు వెల్లడించింది. తప్పుడు కస్టమర్‌ కేర్‌ నంబర్లతో  మోసాల బారిన పడే ప్రమాదం ఉందని ఖాతాదారులను ఎస్‌బీఐ పేర్కొంది.
చదవండి: రిలయన్స్‌తో డీల్‌ క్యాన్సల్‌..! భారత్‌ను వదులుకునే ప్రసక్తే లేదు...!

సైబర్‌ నేరస్తులు కొత్త పుంతలు తొక్కుతూ..కస్టమర్‌ కేర్‌ నంబర్ల సహాయంతో ఖాతాదారుల నుంచి డబ్బులను సేకరిస్తోన్నట్లు ఎస్‌బీఐ గుర్తించింది. ఖాతాదారుల వ్యక్తిగత డేటాను సైబర్‌ నేరస్తుల చేతిలో పెడితే భారీగా ప్రమాదం అవకాశం ఉందని ఎస్‌బీఐ పేర్కొంది. కాగా ఎస్‌బీఐ తాజాగా ఇలాంటి వాటిపై  అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

ఎస్‌బీఐ తన ట్విట్‌లో...‘మోసపూరిత కస్టమర్‌ కేర్‌ నంబర్లతో జాగ్రత్తగా ఉండండి. సరైన కస్టమర్‌ కేర్‌ నంబరు కోసం దయచేసి ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించండి. మీ ఖాతాకు సంబంధించిన వివరాలను ఎవరితో షేర్‌ చేసుకోవద్దునని’ పేర్కొంది. 


చదవండి: అరె డాల్ఫిన్‌లా ఉందే, వరల్డ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ రికార్డ్‌లను తుడిచి పెట్టింది

మరిన్ని వార్తలు