ఎస్‌బీఐ లైఫ్‌ నుంచి ఈషీల్డ్‌ నెక్ట్స్‌ పాలసీ

23 Aug, 2021 03:28 IST|Sakshi

ముంబై: ప్రైవేట్‌ రంగ బీమా రంగ సంస్థ ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొత్తగా ‘ఈషీల్డ్‌ నెక్ట్స్‌’ ప్లాన్‌ ఆవిష్కరించింది. జీవితంలో వివిధ దశలకు (వివాహం, ఇంటి కొనుగోలు మొదలైనవి) అనుగుణంగా కవరేజీ పెరిగే సౌలభ్యం ఉండటం ఈ పాలసీ ప్రత్యేకత. లెవెల్‌ కవర్, పెరిగే కవరేజీ ప్రయోజనం, ఫ్యూచర్‌ ప్రూఫింగ్‌ ప్రయోజనంతో లెవెల్‌ కవర్‌ అంటూ మూడు ఆప్షన్లలో ఇది లభిస్తుంది. పాలసీ తీసుకున్నప్పుడు ఎంచుకున్న ఆప్షనే చివరిదాకా కొనసాగుతుంది. మధ్యలో మార్చుకోవడానికి ఉం డదు. రెగ్యులర్‌గా లేదా ఏకమొత్తంగా లేదా పరిమిత కాలం పాటు ప్రీమియం చెల్లించేందుకు వీలు ఉంటుందని సంస్థ ప్రెసిడెంట్‌ ఆనంద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు