లోన్ తీసుకునేవారికి ఎస్‌బీఐ తీపికబురు

29 Mar, 2021 17:43 IST|Sakshi

మీ కలల గృహం లేదా కారు కోసం లోన్ తీసుకోవాలని యోచిస్తున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. వివిధ అవసరాల కోసం లోన్ తీసుకునే వారి కోసం తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్, గోల్డ్ లోన్, కారు లోన్, విదేశాలలో విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్ వంటి మీకు అవసరమైన రుణం పొందొచ్చు. లోన్ తీసుకోవాలని భావించే వారికి ఇది మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు. స్టేట్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. రుణం తీసుకోవాలని భావించే వారు యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. 

హోమ్ లోన్ తీసుకోవాలని వారికీ వడ్డీ రేటు 6.7 శాతం నుంచి ప్రారంభమౌతోంది. కొత్త కారు కోసం లోన్ పొందాలని చూస్తే 7.5 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. బంగారంపై లోన్ కోసం వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. ఎడ్యుకేషన్ లోన్‌పై 9.3 శాతం వడ్డీ ఉంటే ఎస్‌బీఐ కొంత మంది కస్టమర్లకు ప్రిఅప్రూవ్డ్ రుణాలు అందిస్తోంది. ఈ తరహా పర్సనల్ లోన్‌పై 9.6 శాతం వడ్డీ రేటు ఉండనున్నట్లు పేర్కొంది. ఇకపోతే సిబిల్ స్కోర్ ప్రాతిపదికన మీరు పొందే రుణంపై వడ్డీ రేటు మారొచ్చు. కొత్త ఇళ్ల కోసం రుణాలు తీసుకునే వారికీ ఇది వర్తిస్తుంది. 

చదవండి:

నెలకు రూ.36 లక్షలు సంపాదిస్తున్న 24 ఏళ్ల కుర్రాడు

ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ పండుగ బంపర్ ఆఫర్!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు