ఎస్‌బీఐ ఎంఎఫ్‌ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌

16 Aug, 2021 03:00 IST|Sakshi

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ తాజాగా ఎస్‌బీఐ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌కి సంబంధించి న్యూ ఫండ్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఒడిదుడుకుల ఈక్విటీ మార్కెట్లు పెరిగేటప్పుడు ఒనగూరే అపరిమిత ప్రయోజనాలను ఇన్వెస్టర్లకు అందించడం, పతనమైనప్పుడు వాటిల్లే నష్టాలను ఓ మోస్తరు స్థాయికి పరిమితం చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడుల విలువను పెంచడం ఈ ఫండ్‌ లక్ష్యం. క్రిసిల్‌ హైబ్రిడ్‌ 50+50 – మోడరేట్‌ ఇండెక్స్‌ టీఆర్‌ఐ దీనికి ప్రామాణికంగా ఉంటుంది. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ ఆఫర్‌ ఆగస్టు 25న  ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.5,000. వేల్యు యేషన్లు, ఆదాయాల వృద్ధికి కారణమయ్యే అంశాలు, అధిక రాబడులు అందించగలిగే సామర్థ్యాలు తదితర అంశాల ఆధారంగా ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాలు, డెట్‌ సెక్యూరిటీలు, మనీ మార్కెట్‌ సాధనాలు, రీట్స్, ఇన్విట్స్‌ మొదలైన వాటిలో ఈ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేస్తుందని సంస్థ ఎండీ వినయ్‌ ఎం టోన్సే తెలిపారు.

మరిన్ని వార్తలు