ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపు ఈ సేవలకు అంతరాయం

14 Sep, 2021 17:24 IST|Sakshi

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సెప్టెంబర్ 15న రెండు గంటలు పాటు తన ఆన్ లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు తెలిపింది. "మేము 15 సెప్టెంబర్ 2021న 00:00 గంటల నుంచి 02:00 గంటల (120 నిమిషాలు) మధ్య కాలంలో చేపట్టే మెయింటెనెన్స్‌ కారణంగా ఆన్ లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలు అంతరాయం కలగనున్నట్లు పేర్కొంది. మీకు జరిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము" అని ఎస్‌బీఐ తెలిపింది. ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సౌకర్యాలను అంధించడం కోసం కృషి చేస్తున్నట్లు బ్యాంకు తెలిపింది.(చదవండి: పెన్షనర్లకు ఎస్‌బీఐ శుభవార్త!)

ఇంతకు ముందు కూడా సెప్టెంబర్‌ 4, 5 తేదీల మధ్య మూడు గంటలపాటు అన్ని డిజిటల్‌ సర్వీసులకు అంతరాయం కలగనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్‌ 4వ తేదీ(ఇవాళ రాత్రి) రాత్రి 10.35 నుంచి అర్ధరాత్రి దాటాక 1గం.30ని. వరకు డిజిటల్‌ సర్వీసులు పని చేయవని తెలిపింది. ఈ మూడు గంటలపాటు ఎస్బీఐ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో యాప్‌, యోనో లైట్‌, యోనో బిజినెస్‌, ఐఎంపీఎస్‌, యూపీఐ సర్వీసులేవీ పని చేయవని పేర్కొంది. ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాదారులు సెప్టెంబర్ 30 లోపు తప్పనిసరిగా ఆధార్ తో లింక్ చేయాలని పేర్కొంది. ఒకవేళ లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదని తెలిపింది.

మరిన్ని వార్తలు