కస్టమర్ల భద్రత కోసం ఎస్‌బీఐ కొత్త ఫీచర్‌

4 Sep, 2020 10:28 IST|Sakshi

న్యూఢిల్లీ : తమ ఖాతాదారుల భద్రత కోసం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ మరో ముందడుగు వేసింది. ఏటీఎమ్‌ మోసాలను అరికట్టేందుకు ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఏటీఎమ్‌తో బ్యాలెన్స్‌ , మినీ స్టేట్‌మెంట్‌ ఎంక్వైరీ చేసిన ప్రతిసారి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓ మెసెజ్ పంపటం‌ ద్వారా ఖాతాధారులను అలర్ట్‌ చేయనుంది. ఈ మెసేజ్‌ అలర్ట్‌ కారణంగా.. ఒకవేళ అనధికార లావాదేవీ జరుగుతున్నట్లయితే సదరు ఖాతాదారుడు వెంటనే స్పందించి తన ఏటీఎమ్‌ కార్డును బ్లాక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ( ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ రుపే కార్డ్ :  ఆఫర్లు)

ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించిన వివరాలను ఎస్‌బీఐ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో మంగళవారం వెల్లడించింది. బ్యాలన్స్‌, మినీ స్టేట్‌మెంట్‌ ఎంక్వైరీలకు సంబంధించిన ఎస్‌ఎమ్‌ఎస్‌ అలర్ట్‌లను నిర్లక్ష్యం చేయవద్దని ఎస్‌బీఐ పేర్కొంది. అనధికారిక లావాదేవీ జరుగుతున్నట్లయితే వెంటనే ఏటీఎమ్‌ను బ్లాక్‌ చేయాలని తెలిపింది. 

మరిన్ని వార్తలు