ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌ హోంలోన్‌ ఆఫ్‌ర్‌ పొడిగింపు, ఇక కార్‌ లోన్లపై..!

27 Sep, 2023 18:12 IST|Sakshi

SBI Festive Offer: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.పండుగ సీజన్‌లో  కార్ లోన్ తీసుకునే కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌  చెప్పింది. కొత్తగా కారు కనాలనుకునే కస్టమర్ల లోన్లపై తాజా ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. ఈ ఆఫర్ 2024, జనవరి 31  వరకు అందుబాటులో ఉంటుంది.

హోమ్‌లోన్లపై రాయితీ పొడిగింపు
అంతేకాదు హోమ్‌లోన్లపై అందిస్తున్న రాయితీని  పొడిగించింది. గరిష్టంగా  65 బేసిస్ పాయింట్ల (bps) తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఇపుడు ఆఫర్‌నురానున్న ఫెస్టివ్‌ సీజన్‌ నేపథ్యంలో పొడిగించింది. డిసెంబరు 2023 దాకా తగ్గింపు వడ్డీరేట్లు వర్తిస్తాయిని బ్యాంకు వెల్లడించింది. (ఈ బ్యాంకు కస్టమర్లకు సర్‌ప్రైజ్‌: పండగ బొనాంజా)

సంవత్సరానికి ఆటో రుణంపై బ్యాంకు  MCLR రేటు 8.55 శాతం. గ్రీన్ కార్ లోన్ (ఎలక్ట్రిక్ వెహికల్) 9.65 శాతం నుండి 9.35 శాతం  వడ్డీ వసూలు చేస్తుంది. కస్టమరల క్రెడిట్ స్కోర్‌లు , విభిన్న కాలవ్యవధుల ప్రకారం వివిధ కార్ లోన్ రేట్లు నిర్ధారిస్తుంది.  అతి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందిస్తున్నామని బ్యాంకు పేర్కొంది. కారు లోన్ కోసం గరిష్ట కాలవ్యవధి 7 సంవత్సరాలు. కారు ఆన్-రోడ్ ధరమొత్తంలో 90 శాతం వరకు రుణం ఇవ్వవచ్చు.ఈ లోన్ ద్వారా  కొత్త ప్యాసింజర్ కారు, మల్టీ యుటిలిటీ వెహికల్ , SUVని కొనుగోలు చేయవచ్చు. కస్టమర్ ప్రీపేమెంట్ చేయాలనుకుంటే, ఎలాంటి ముందస్తు చెల్లింపు ఛార్జీ తీసుకోబడదు. అలాగే ఏడాది తరువాత త కస్టమర్‌పై ఎలాంటి ఫోర్‌క్లోజర్ ఛార్జీ ఉండదు. కారు రుణాలపై పరిమిత కాల వ్యవధిలో అందిస్తున్న ప్రాసెసింగ్ ఫీజు ఆఫర్‌ పొందాలంటే కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.  (డెల్టా కార్ప్‌ కథ కంచికేనా? జియా మోడీ మేజిక్‌ చేస్తారా? అసలెవరీ మోడీ?)

అవసరమైన పత్రాలు
6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్‌, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, రెసిడెన్షియల్‌ ప్రూఫ్‌, ఫారం 16, ఐడీ కార్డు (పాన్ ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్) లాంటివి ఇవ్వవచ్చు.

ప్రీ-అప్రూవ్డ్ కార్ లోన్ ఎలా పొందాలి?
ప్రీ-అప్రూవ్డ్ కార్ లోన్ తీసుకోవడానికి, బ్యాంకు యాప్ యోనోకులాగిన్ అవ్వాలి. ప్రీ-అప్రూవ్డ్ కార్ లోన్ బ్యానర్‌పై క్లిక్ చేసి, అక్కడ మీ వివరాలను ధృవీకరించడంతోపాటు, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఆ తర్వాత  ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ లెటర్  వస్తుంది దీన్ని సంబంధిత బ్యాంకు శాఖలో సమర్పించాలి.

మరిన్ని వార్తలు