SBI: గోల్డ్‌లోన్‌ తీసుకునే వారికి ఎస్‌బీఐ శుభవార్త...!

5 Aug, 2021 15:24 IST|Sakshi

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గోల్డ్‌ లోన్‌ తీసుకునే వారికి శుభవార్తను అందించింది. ఎస్‌బీఐ బ్యాంకులో గోల్డ్‌ రుణాలను తీసుకునేవారికి వడ్డీరేట్లపై రాయితీని ప్రకటించింది. గోల్డ్‌రుణాల వడ్డీరేట్లపై సుమారు 0.75 శాతం రాయితీను ఎస్‌బీఐ అందించనుంది. ఈ ఆఫర్‌ 2021 సెప్టెంబర్‌ 30 వరకు అందుబాటులో ఉండనుంది. ఎస్‌బీఐ గోల్డ్‌ రుణాలపై 7 శాతం నుంచి 29 శాతం వరకు వడ్డీరేట్లను అందిస్తోంది.

ఎస్‌బీఐ గోల్డ్‌లోన్‌లను ఇప్పుడు యోనో యాప్‌ను ఉపయోగించి కూడా రుణాలను పొందవచ్చును. తక్కువ పేపర్‌ వర్క్‌, తక్కువ ప్రాసెసింగ్‌ టైంతో గోల్డ్‌లోన్స్‌ యోనో యాప్‌ ద్వారా పొందవచ్చును. కరోనా రాకతో ఖాతాదారులు ఎక్కువగా గోల్డ్‌ లోన్‌పై ఆధారపడ్డారు. అంతేకాకుండా కరోనా సమయంలో గోల్డ్‌ లోన్స్‌ కూడా గణనీయంగా పెరిగాయి.   

యోనో యాప్‌ ఉపయోగించి ఇలా గోల్డ్‌లోన్‌ పొందండి.

  • ముందుగా మీ మొబైల్‌లోని యోనో యాప్‌ను ఓపెన్‌ చేయండి.
  •  యోనో యాప్‌లోకి లాగిన్‌ అయ్యాక హోమ్‌పేజీలో ఎగువ ఎడమవైపు ఉన్న మెనూ (మూడు లైన్లు) పై క్లిక్ చేయాలి.
  • లోన్స్‌ ఆప్షన్లపై క్లిక్ చేయాలి.
  • గోల్డ్ లోన్ మీద క్లిక్ చేయండి. 
  • ఇప్పుడు ఆప్లై నౌ పైక్లిక్ చేయండి.
  • తరువాత పేజీలో ఆభరణాల వివరాలను (రకం, పరిమాణం, క్యారెట్  నికర బరువు) డ్రాప్‌డౌన్‌లో అందుబాటులో ఉన్న అన్ని ఇతర వివరాలతో (రెసిడెన్షియల్ రకం, వృత్తి రకం) నింపాల్సి ఉంటుంది. , మీ నెలవారీ ఆదాయాన్ని ఫిల్‌ చేయండి.  అప్లికేషన్‌ను సబ్మిట్‌ చేయండి. 
  • బంగారంతో దగ్గరలో ఉన్న ఎస్‌బీఐ బ్యాంకును సంప్రదించండి.
  • తాకట్టు పెట్టాల్సిన బంగారంతో పాటు 2 ఫోటోలు, కేవైసీ పత్రాలతో బ్రాంచ్‌కు వెళ్లండి.
  • సంబంధిత లోన్‌ ఆప్లికేషన్‌ ఫాంలో సంతకం చేయండి. 
  • బ్యాంకు సిబ్బంది బంగారాన్ని నిర్ధారించిన తరువాత మీకు బంగారం విలువను బట్టి బ్యాంకు రుణాలను ఇస్తుంది. 
మరిన్ని వార్తలు