సీనియర్ సిటిజన్ల కోసం ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్​డీ స్కీమ్‌

20 Jul, 2021 14:49 IST|Sakshi

దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) భారతదేశంలోని సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఎఫ్​డీ పథకాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ఎఫ్​డీ పథకం కింద ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి పెట్టుబడి పెట్టె నగదుపై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్ల కన్న అధిక వడ్డీని ఆఫర్ చేస్తుంది. ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్ గా పిలువబడే ఈ కొత్త స్కీమ్ వల్ల వారి ఎఫ్​డీ డిపాజిట్లపై అదనంగా 30 బేసిస్ వడ్డీ పాయింట్లు లభిస్తాయి.

ప్రస్తుతం, ఎస్‌బీఐ అన్ని కాలవ్యవధుల టర్మ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్ల ను అందిస్తుంది. వీకేర్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టడంతో వారు ఇప్పుడు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టె టర్మ్ డిపాజిట్లపై 80 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీని పొందవచ్చు. సీనియర్ సిటిజన్ల కోసం ఎస్‌బీఐ వీకేర్ ప్రత్యేక ఎఫ్​డీ స్కీమ్‌ ఇప్పుడు సెప్టెంబర్ 30, 2021 వరకు అందుబాటులో ఉంటుంది.

ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్ ఎఫ్​డీ స్కీమ్‌ వివరాలు

  • 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు అర్హులు.
  • ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి ఇందులో ఎఫ్​డీ చేయాలి. 
  • బ్యాంకు గరిష్ట డిపాజిట్ రూ.2 కోట్లు
  • ప్రత్యేక ఎఫ్​డీ పథకాన్ని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు.
  • ఈ డిపాజిట్లపై బ్యాంకు సీనియర్ సిటిజన్లకు 80 బేసిస్ పాయింట్ల అధిక వడ్డీ రేట్లను అందిస్తోంది.
  • ఒక సీనియర్ సిటిజన్ ప్రత్యేక ఎఫ్​డీ స్కీమ్‌ కింద డబ్బును ఎఫ్​డీ చేస్తే వర్తించే వడ్డీ రేటు 6.2 శాతం
  • గడువు కన్న ముందు నగదు విత్ డ్రా చేస్తే అదనపు 30 బిపీఎస్ ప్రీమియం వర్తించదు. బ్యాంకు 0.5 శాతం జరిమానా విధించవచ్చు.
     
మరిన్ని వార్తలు