దాల్‌ సరస్సులో ఎస్‌బీఐ ఫ్లోటింగ్ ఎటిఎమ్

22 Aug, 2021 20:07 IST|Sakshi

జమ్మూ కాశ్మీర్ స్థానికులకు, పర్యాటకులకు ఎస్‌బీఐ భారీ బహుమతి ఇచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వారం శ్రీనగర్ లోని దాల్‌ సరస్సులోని హౌస్‌బోట్‌లో తేలియాడే ఎటిఎంను ప్రారంభించింది. "స్థానికులు, పర్యాటకుల సౌకర్యం కోసం శ్రీనగర్ దాల్‌ సరస్సులో హౌస్‌బోట్‌లో ఎస్‌బీఐ ఎటిఎమ్ ప్రారంభించింది. దీనిని ఎస్‌బీఐ ఛైర్మన్ ఆగస్టు 16న ప్రారంభించారు. ప్రముఖ దాల్ సరస్సులోని #FloatingATM దీర్ఘకాలిక అవసరాన్ని నెరవేరుస్తుంది. ఇది శ్రీనగర్ కు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని" ఎస్‌బీఐ ఒక ట్వీట్ లో పేర్కొంది. 

ఎస్‌బీఐ 2004లో కేరళలో తేలియాడే ఎటిఎంను మొదటిసారి ప్రారంభించింది. కేరళ షిప్పింగ్, ఇన్ లాండ్ నావిగేషన్ కార్పొరేషన్ (కెఎస్ఐఎన్ సీ) యాజమాన్యంలోని ఝాంకర్ యాచ్ లో ఎస్‌బీఐ ఫ్లోటింగ్ ఎటిఎమ్ ఏర్పాటు చేసింది. ఎర్నాకుళం & వాయ్పియన్ ప్రాంతం మధ్య ఈ హౌస్‌బోట్‌ పనిచేస్తుంది. తన తన కస్టమర్ల సౌలభ్యం కొరకు ఎస్‌బీఐ నిరంతరం సేవలు అందిస్తుంది. భారతదేశంలో 22,224 బ్రాంచీలు, 63,906 ఎటిఎమ్/సిడిఎమ్ నెట్ వర్క్ తో ఎస్‌బీఐ అతిపెద్ద వాణిజ్య బ్యాంకుగా ఉంది.

>
మరిన్ని వార్తలు