అదానీ కాపర్‌ యూనిట్‌కు రూ,6,071 కోట్ల రుణం

27 Jun, 2022 06:22 IST|Sakshi

ఎస్‌బీఐ, ఇతర ప్రభుత్వరంగ బ్యాంకుల సాయం

న్యూఢిల్లీ: అదానీ గ్రూపు కాపర్‌ తయారీ వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది. ఇందుకోసం ఎస్‌బీఐ సహా ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.6,071 కోట్ల రుణాన్ని సమకూర్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఏడాదికి మిలియన్‌ టన్నుల కాపర్‌ తయా రీ యూనిట్‌ను గుజరాత్‌లోని ముంద్రాలో, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అనుబంధ ‘కుచ్‌ కాపర్‌ లిమిటెడ్‌’ ఏర్పాటు చేయనుంది. రెండు దశల్లో గ్రీన్‌ఫీల్డ్‌ కాపర్‌ రిఫైనరీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్టు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రకటించింది.

ఇందులో భాగంగా 0.5 మిలియన్‌ టన్నులతో కూడిన మొదటి దశకు సిండికేటెడ్‌ క్లబ్‌ లోన్‌ రూపంలో ఫైనాన్షియల్‌ క్లోజర్‌ (రుణ ఒప్పందాలు) పూర్తయినట్టు తెలిపింది. ఎస్‌ బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం (బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంకు, ఎగ్జిమ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంకు, పీఎన్‌బీ, బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర)తో ఒప్పందం చేసుకున్న ట్టు ప్రకటించింది. ప్రాజెక్టు తొలి దశ 2024లో మొదలవుతుందని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ డైరెక్టర్‌ వినయ్‌ ప్రకాశ్‌ తెలిపారు. ‘‘ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కాపర్‌ రిఫైనరీ కాంప్లెక్స్‌ల్లో ఒకటి అవుతుంది. బెంచ్‌మార్క్‌ ఈఎస్‌జీ (పర్యావరణ అను కూల) పనితీరు ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికత, డిజిటైజేషన్‌తో ఉంటుంది’’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు