బజాజ్‌ హిందుస్తాన్‌పై ఎస్‌బీఐ దివాలా పిటీషన్‌

17 Aug, 2022 08:47 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా అతి పెద్ద చక్కెర, ఇథనాల్‌ తయారీ సంస్థ బజాజ్‌ హిందుస్తాన్‌ షుగర్‌పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పిటీషన్‌ వేసింది. 

నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అలహాబాద్‌ బెంచ్‌లో ఈ మేరకు అభ్యర్ధన దాఖలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో రుణ వాయిదా, కూపన్‌ రేటు వడ్డీ చెల్లింపుల్లో జాప్యం చేయడంతో రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనల ప్రకారం కంపెనీ ఖాతాను మొండి పద్దు (ఎన్‌పీఏ) కింద వర్గీకరించినట్లు ఎస్‌బీఐ పేర్కొంది.

కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,607 కోట్ల టర్నోవరుపై రూ. 268 కోట్ల నికర నష్టం (కన్సాలిడేటెడ్‌) ప్రకటించింది. బజాజ్‌ హిందుస్తాన్‌ షుగర్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌లో పధ్నాలుగు ప్లాంట్లు ఉన్నాయి.    

చదవండి👉 కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త..!

మరిన్ని వార్తలు