క్యూ1 ఫలితాల్లో అదరగొట్టిన ఎస్‌బీఐ..!

4 Aug, 2021 16:22 IST|Sakshi

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో  అదరగొట్టింది. ఎస్‌బీఐ త్రైమాసిక ఫలితాలను బుధవారం రోజున విడుదల చేసింది. మొదటి త్రైమాసికంలో నికరలాభం 55 శాతం పెరిగి రూ. 6,504 కోట్లుగా నమోదైంది. చివరి ఏడాది 2020-21 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ .4,189.34 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. 

2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్‌బీఐ స్టాండలోన్ మొత్తం ఆదాయం  మొదటి త్రైమాసికంలో రూ .77,347.17 కోట్లకు పెరిగింది. గత ఏడాది త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ .74,457.86 కోట్ల ఆదాయంగా నమోదు చేసింది. నిరర్థక ఆస్తులు (నాన్‌ పర్‌ఫార్మింగ్‌ అసెట్స్‌) జూన్ ముగింపులో 5.44 శాతం నుంచి 5.32 శాతానికి తగ్గాయి. అదేవిధంగా, నికర ఎన్‌పీఎ మొత్తం గత ఏడాది పోలిస్తే 1.8 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గాయి.

గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎస్‌బీఐ మొత్తం ఆదాయం రూ .87,984.33 కోట్లతో పోలిస్తే ప్రస్తుత ఆదాయం రూ. 93,266.94 కోట్లకు పెరిగింది. ఎస్‌బీఐ క్యూ1 ఫలితాలు మెరుగ్గా నమోదవ్వడంతో బీఎస్‌ఈ స్టాక్‌ మార్కెట్‌లో ఎస్‌బీఐ షేర్‌ విలువ 2 శాతం మేర లాభాలను గడించింది.

మరిన్ని వార్తలు