ఎస్‌బీఐ లాభం జూమ్‌

7 Feb, 2022 00:53 IST|Sakshi

క్యూ3లో రూ. 8,432 కోట్లు

బలపడిన నికర వడ్డీ మార్జిన్లు

రూ. 30,687 కోట్లకు ఆదాయం

ముంబై: బ్యాంకింగ్‌ రంగ పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో స్టాండెలోన్‌ నికర లాభం 62 శాతంపైగా జంప్‌ చేసి రూ. 8,432 కోట్లను తాకింది. బ్యాంక్‌ చరిత్రలోనే ఒక త్రైమాసికంలో ఇది అత్యధికంకాగా.. గతేడాది(2020–21) క్యూ3లో కేవలం రూ. 5,196 కోట్లు ఆర్జించింది. ఇందుకు ప్రొవిజన్లు తగ్గడం సహకరించింది. తాజా సమీక్షా కాలంలో ని కర వడ్డీ ఆదాయం 6.5 శాతం పుంజుకుని
రూ.30 ,687 కోట్లకు చేరింది. దేశీయంగా నికర వడ్డీ మా ర్జి న్లు 3.34 శాతం నుంచి 3.4 శాతానికి బలపడ్డాయి.

తగ్గిన ప్రొవిజన్లు
ఈ ఏడాది క్యూ3లో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 4.77 శాతం నుంచి 4.5 శాతానికి ఉపశమించాయి. నికర ఎన్‌పీఏలు మాత్రం 1.23 శాతం నుంచి 1.34 శాతానికి పెరిగాయి. తాజా స్లిప్పేజీలు రూ. 2,334 కోట్లుకాగా.. రికవరీ, అప్‌గ్రెడేషన్లు 59 శాతం నీరసించి రూ. 2,306 కోట్లకు పరిమితమయ్యాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 12,137 కోట్ల నుంచి రూ. 10,090 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 13.23 శాతంగా నమోదైంది. కోవిడ్‌ రిజల్యూషన్‌ ప్రణాళిక 1, 2లలో భాగంగా రూ. 32,895 కోట్ల రుణాల పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు బ్యాంక్‌ పేర్కొంది. ఇవి మొత్తం లోన్‌బుక్‌లో 1.2 శాతానికి సమానం.

ఆరు ఖాతాల అమ్మకం
ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీల(ఏఆర్‌సీలు)కు విక్రయించేందుకు ఆరు మొండి(ఎన్‌పీఏ) ఖా తా ల ను ఎంపిక చేసినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. వీటి వి లువ రూ. 406 కోట్లుకాగా.. జాబితాలో పాట్నా బ క్తియార్‌పూర్‌ టోల్‌వే(రూ. 231 కోట్లు), స్టీల్‌కో గు జరాత్‌(రూ. 68 కోట్లు), జీవోఎల్‌ ఆఫ్‌షోర్‌(రూ. 5 1 కోట్లు), ఆంధ్రా ఫెర్రో అలాయ్స్‌(రూ. 27 కో ట్లు), గురు ఆశిష్‌ ట్యాక్స్‌ఫ్యాబ్‌(రూ. 17 కోట్లు)లను పేర్కొంది.

పలు అంశాల్లో ప్లస్‌
బిజినెస్, లాభదాయకత, ఆస్తుల(రుణాలు) నాణ్యతలో బ్యాంక్‌ నిరవధికంగా మెరుగుపడుతోంది. ట్రెజరీ ఆదాయంలో స్వల్ప సమస్యలున్నప్పటికీ.. వడ్డీ, ఇతర ఆదాయాల్లో వృద్ధి సాధించింది. రుణ నాణ్యత తక్కువ ప్రొవిజన్లకు దారి చూపింది. అనిశ్చితుల కారణంగా భవిష్యత్‌లో ఎలాంటి సవాళ్లు ఎదురైనా అధిగమించేందుకు తగిన స్థాయిలో కంటింజెన్సీ కేటాయింపులు చేపట్టాం. రూ. 1,700 కోట్ల అదనపు ప్రొవిజన్లు చేపట్టాం.
– ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ ఖారా

మరిన్ని వార్తలు