ఎస్‌బీఐ vs పోస్టాఫీస్: ఎందులో డబ్బులు పొదుపు చేస్తే మంచిది?

28 Jun, 2021 18:37 IST|Sakshi

మీరు ప్రతి నెలా చిన్న మొత్తంలో డబ్బులు ఆదా చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు రికరింగ్ డిపాజిట్లు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులో ఎటువంటి రిస్క్ ఉండదు. 6 నెలల నుంచి 10 ఏళ్ల వరకు మీరు రికరింగ్ డిపాజిట్ సేవలను పొందవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎంత వడ్డీ రేటు వస్తుందో.. అదే వడ్డీ రేటు ఆర్‌డీ ఖాతాలపై కూడా వస్తుంది. దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా పోస్టాఫీస్‌లలో కూడా ఆర్‌డీ ఖాతాలను తెరవచ్చు. ఆర్‌డీ కాలపరిమితి ముగిసిన తర్వాత కస్టమర్ మెచ్యూరిటీ మొత్తాన్ని అందుకుంటాడు. మెచ్యూరిటీ సమయంలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీతో సహ కలిపి వినియోగదారులకు తిరిగి చెల్లిస్తారు.

పోస్టాఫీస్:
జనవరి 1, 2021 నుంచి పోస్టాఫీస్ లో ప్రతి ఆర్ధిక సంవత్సరానికి 5.8 శాతం వడ్డీరేటును పొదుపు చేసిన సొమ్ముపై అందిస్తుంది. దీనికి 5 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ అకౌంట్ తెరవడానికి కనీసం నెలకు రూ.10 కట్టినా సరిపోతుంది. మీ డబ్బుకు రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబడి వస్తుంది.

ఎస్‌బీఐ:
ఎస్‌బీఐ ఆర్‌డీ వడ్డీ రేటు సాధారణ ఖాతాదారులకు 5 నుంచి 5.4శాతం ఉంటే సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు కలుపుతారు. ఈ వడ్డీ రేట్లు జనవరి 8, 2021 నుంచి వర్తిస్తాయి. ఎస్‌బీఐ ఆర్‌డీ మెచ్యూరిటీ పీరియడ్ 1 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉంటుంది. నెలకు కనీసం రూ.100 నుంచి పొదుపు చేయవచ్చు. ఐదేళ్ల నుంచి పదేళ్ల కాల పరిమితిలోని ఆర్‌డీలకు 5.4 శాతం వడ్డీ వర్తిస్తుంది. పెట్టుబడి మొత్తంపై గరిష్ట పరిమితి లేదు. మొదటి రెండు సంవత్సరాలకు - 4.9 శాతం వడ్డీ,  2- 3 సంవత్సరాల వరకు - 5.1%, 3 - 5 సంవత్సరాల వరకు - 5.3%, 5 - 10 సంవత్సరాల వరకు - 5.4 శాతం వడ్డీ రేటు ఉంటుంది.

చదవండి: ల్యాప్‌టాప్‌ కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు