ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త..!

1 May, 2021 14:28 IST|Sakshi

ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎస్‌బీఐ గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. గృహ రుణాలను తీసుకునే వారికి 6.70 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా మహిళ రుణ గ్రహీతలకు 5 బేసిక్‌ పాయింట్ల వరకు రాయితీని ఇవ్వనుంది. ఖాతాదారులు యోనో యాప్‌ నుంచి గృహరుణాలను పొందవచ్చునని ఎస్‌బీఐ తెలిపింది. యోనో యాప్‌ నుంచి రుణాలను తీసుకున్న ఖాతాదారులకు 5 బేసిక్‌ పాయింట్ల వరకు రాయితీని ఇవ్వనుంది.

ఈ సందర్భంగా సంస్ధ ఎండీ సీఎస్‌ శెట్టి(రిటైల్ & డిజిటల్ బ్యాంకింగ్) మాట్లాడుతూ...“ఎస్‌బీఐ హోమ్ ఫైనాన్స్‌లో మార్కెట్ లీడర్‌గా ఉంటూ, గృహ రుణ మార్కెట్లో వినియోగదారులను సంతృప్తి పరచడానికి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత గృహ రుణ వడ్డీ రేట్లతో ఖాతాదారులకు రుణాలను తీసుకునే  స్థోమత బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇది ఈఎంఐ మొత్తాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ చర్యలతో  రియల్ ఎస్టేట్ పరిశ్రమకు వెనుదన్నుగా నిలుస్తుంద"ని పేర్కొన్నారు.

ఎస్‌బీఐ గృహ రుణ వడ్డీ రేట్లు రూ. 30 లక్షలకు 6.70 శాతం , రూ. 30 లక్షలు నుంచి 75 లక్షల వరకు 6.95 శాతం . రూ. 75 లక్షలకుపైగా రుణాలను తీసుకునే వారికి 7.05 శాతం వద్ద గృహ రుణాలు  లభిస్తాయని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంకు గృహ రుణ పోర్ట్‌ఫోలియో రూ. 5 లక్షల కోట్ల మైలు రాయిని చేరిందని  ఎస్‌బీఐ తెలిపింది. 2020 డిసెంబర్ 31 నాటికి బ్యాంకు దగ్గర ఆటో లోన్ బుక్ రూ. 75,937 కోట్లు ఉందని తెలిపింది. బ్యాంకు డిపాజిట్ బేస్ రూ. 35 లక్షల కోట్లు ఉందని పేర్కొన్నారు.

చదవండి: SBI Recruitment 2021: ఎస్‌బీఐలో 5454 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు

మరిన్ని వార్తలు