SBI : ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌..!

29 Jul, 2021 15:25 IST|Sakshi

ప్రభుత్వ దిగ్గజ బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులను హెచ్చరించింది. బ్యాంకు ఖాతాదారులకు  పలు బూటకపు మెసేజ్‌లను వారి మొబైల్‌ నంబర్లకు, ఈ-మెయిల్‌ అకౌంట్లకు సైబర్‌ నేరస్థులు పంపుతుంటారు. ఒక వేళ ఫోన్లకు, ఈ-మెయిల్‌కు వచ్చే మెసేజ్‌లను నమ్మితే అంతే సంగతులు...! ఖాతాదారుల అకౌంట్లలోని డబ్బులను సైబర్‌ నేరస్థులు సమస్తం ఉడ్చేస్తారు. తన ఖాతాదారులను అప్రమత్తం చేయడానికి ఎస్‌బీఐ పలు సూచనలను చేసింది. బూటకపు మెసేజ్‌లు, ఇతర ఫిషింగ్‌ మోసాల నుంచి ఎప్పటికప్పుడు ఎస్‌బీఐ తన ఖాతాదారులను అప్రమత్తం చేయడంలో ఒక అడుగు ముందే ఉంటుంది.

తాజాగా ఎస్‌బీఐ తన ఖాతాదారులకు బూటకపు మేసేజ్‌లను గుర్తించడంలో పలు సూచనలు చేసింది. ఖాతాదారులకు వచ్చే సందేశాలు బ్యాంకు పంపిందా లేదా.. అనే విషయాన్ని ఏలా ధృవీకరించాలనే విషయాన్ని ఎస్‌బీఐ పేర్కొంది.  ఎస్‌బీఐ తన ఖాతాదారులకు కేవలం ‘SBI/SB’ అనే షార్ట్‌కోడ్స్‌ను ఉపయోగించి మాత్రమే మొబైల్‌ నంబర్‌కు మేసేజ్‌లను పంపుతుందని ట్విటర్‌లో పేర్కొంది. ఉదాహరణకు SBIBNK, SBIINB, SBIPSG, SBIYONO లాంటి మేసేజ్‌లు బ్యాంకు పంపినట్లుగా ఖాతాదారులు ధృవీకరించాలని ఎస్‌బీఐ పేర్కొంది. ఇతర గుర్తుతెలియని మెసేజ్‌లను అసలు ఒపెన్‌ చేయకుండా ఉండడమే మంచిదని ఎస్‌బీఐ పేర్కొంది.

మరిన్ని వార్తలు