హమ్మయ్యా..ఎస్‌బీఐ ఖాతాదారులకు భారీ ఊరట!

18 Sep, 2022 11:25 IST|Sakshi

ఖాతాదారులకు ఎస్‌బీఐ భారీ ఊరట కల్పించింది. మొబైల్‌ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా చేసే మనీ ట్రాన్స్‌ ఫర్‌పై వసూలు చేసే ఎస్‌ఎంఎస్‌ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇకపై మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు ఉచితంగా వినియోగించుకోవడంపై ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా యూఎస్‌ఎస్‌డీ సేవల్ని ఉపయోగించుకోవచ్చని ఎస్‌బీఐ ట్వీట్‌ చేసింది. *99# డయల్ చేసి బ్యాంకింగ్ సేవల్ని పూర్తిగా ఉచితంగా పొందవచ్చని ట్వీట్‌లో పేర్కొంది.   

"మొబైల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌లపై ఎస్ఎమ్ఎస్ ఛార్జీలు రద్దు చేయబడ్డాయి! వినియోగదారులు ఇప్పుడు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా సౌకర్యవంతంగా లావాదేవీలు జరుపుకోవచ్చని చెప్పింది.   

యూఎస్‌ఎస్‌డీ సర్వీస్ అంటే 
యూఎస్‌ఎస్‌డీ అంటే అన్ స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా అని అర్ధం. మొబైల్‌ నుంచి మనీ ట్రాన్స్‌ ఫర్‌, బ్యాంక్‌ అకౌంట్‌లో బ్యాలెన్స్ చెక్ చేయడం, బ్యాంక్ స్టేట్ మెంట్ జనరేట్ చేయడంతో పాటు ఇతర సేవల్ని ఈ యూఎస్‌ఎస్‌డీ ద్వారా వినియోగించుకోచ్చు. ఈ సర్వీస్ ఫీచర్ ఫోన్లపై పనిచేస్తుంది. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూజర్లు బ్యాంకింగ్ పొందవచ్చు. *99# కోడ్ ద్వారా మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించడం ద్వారా స్మార్ట్ ఫోన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఫండ్ ట్రాన్స్ ఫర్ లేదా అకౌంట్ స్టేట్ మెంట్‌తో పాటు ఇతర సేవల్ని వినియోగించుకునేందుకు ఖాతాదారులకు ఎస్‌బీఐ అనుమతిస్తుంది.

 చదవండి👉 యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాదారులకు భారీ షాక్‌!

మరిన్ని వార్తలు