బ్యాంక్ ఖాతాదారులకు ఎస్‌బీఐ అలర్ట్!

27 Jun, 2021 19:45 IST|Sakshi

దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కెవైసీ(నో యువర్ కస్టమర్) పేరుతో జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఖాతాదారులను హెచ్చరించింది. మీకు కెవైసీ ఏమైనా కాల్స్ లేదా మెసేజ్ లు వస్తే వాటి గురుంచి సైబర్ క్రైమ్ కు తెలియయజేయలని కోరింది. ట్విట్టర్ లో ఒక పోస్టులో "ఎస్‌బీఐ కెవైసీ పేరుతో జరుగుతున్న మోసం దేశవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తుందని. అటువంటి మోసగాళ్లు ఎస్‌బీఐ ప్రతినిధి పేరుతో పంపిన ఎటువంటి లింక్ పై క్లిక్ చేయవద్దు అని కోరింది". 

స్కామర్లు టెక్స్ట్ సందేశంలో లింక్ పంపడం, కెవైసీని అప్ డేట్ చేయమని టార్గెట్ వ్యక్తిని అడగడం ద్వారా మోసం చేస్తారని బ్యాంక్ వివరించింది. ఈ విపరీతమైన నేర కార్యకలాపాల గురించి http://cybercrime.gov.in కి నివేదించండి అని అంది. ఈ కరోనా మహమ్మరి కాలంలో ఇటువంటి మోసాలు భారీగా పేరుగుతున్నట్లు సైబర్ నిపుణులు కూడా సూచిస్తున్నారు. అందుకే ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎవరితో షేర్ చేయవద్దు అని బ్యాంక్ తెలియయజేస్తుంది. అలాగే ఎస్‌బీఐ పేరుతో ఇతర మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఖాతాదారులను కోరింది.

చదవండి: ఆధార్ కు కూడా మాస్క్.. ఇక మీ ఆధార్ నెంబర్ మరింత సురక్షితం!

మరిన్ని వార్తలు