ఎస్‌బీఐ వినియోగదారులకు అలర్ట్!

11 Nov, 2021 19:20 IST|Sakshi

SBI Warns of KYC Fraud: దేశంలో ఇటీవల ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతుండటంతో ఎస్‌బీఐ తన వినియోగదారులను హెచ్చరించింది. దేశంలో ఎక్కువగా సైబర్ నేరాలకు గురి అవుతున్న వారిలో ఎస్‌బీఐ ఖాతాదారులు ఉండటంతో కేవైసీ మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కేవైసీ వెరిఫికేషన్ పేరుతో మోసగాళ్లు ఎస్‌బీఐ కస్టమర్లకు వల వేస్తున్నారని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. భారతదేశపు అతిపెద్ద పబ్లిక్ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వినియోగదారులు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

"బ్యాంకు పేరుతో ఎస్‌ఎంఎస్‌, వాట్సప్‌ ద్వారా వచ్చే కేవైసీ అప్‌డేట్ లింక్స్‌ని క్లిక్ చేయకూడదని హెచ్చరిస్తోంది. ఇటువంటి మోసాల గురుంచి http://cybercrime.gov.inకు నివేదించండి" అని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. కేవైసీ అప్‌డేట్ కోసం బ్యాంకులు ఎలాంటి లింక్స్ పంపవని ఎస్‌బీఐ చెబుతోంది. మీ మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, డెబిట్ కార్డ్ నెంబర్, పిన్, ఓటీపీ లాంటి సున్నితమైన వివరాలను ఎవరితో షేర్ చేసుకోవద్దని హెచ్చరిస్తోంది. ఇలాంటి ఎస్ఎంఎస్ మోసాలకు బలైపోవద్దని వినియోగదారులను హెచ్చరించింది.

ఆన్‌లైన్ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండండి ఇలా..?

  • కేవైసీ అప్‌డేట్ కోసం బ్యాంకులు ఎలాంటి లింక్స్ పంపవు.
  • తెలియని వనరుల నుంచి ఎస్ఎమ్ఎస్/ఈ-మెయిల్స్ ద్వారా వచ్చిన అటాచ్ మెంట్/లింక్స్‌పై క్లిక్ చేయవద్దు.
  • తెలియని వ్యక్తుల నుంచి టెలిఫోన్ కాల్స్/ఈ-మెయిల్స్ ఆధారంగా ఎలాంటి మొబైల్ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు.
  • ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, డెబిట్ కార్డు నంబర్, పీన్, సీవీవీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ/పాస్‌వర్డ్‌, ఓటీపీ వంటి సున్నితమైన వివరాలను ఎవరితో పంచుకోవద్దు.

(చదవండి: ఏరులైపారుతున్న తేనే! ఈ ఏడాది 1.25 లక్షల టన్నుల ఉత్పత్తి)

మరిన్ని వార్తలు