శరీరాన్ని ఉపయోగించి స్మార్ట్‌వాచ్‌ ఛార్జింగ్‌..!

14 Jun, 2021 20:55 IST|Sakshi

సాధారణంగా స్మార్ట్‌వాచ్స్‌, ఇయర్‌ బడ్స్‌, వాడేవారికి ఎక్కువగా వెంటాడే సమస్య బ్యాటరీ. బ్యాటరీ పూర్తిగా ఐపోతే అవి ఎందుకు పనికిరావు. ఈ ఎలక్ట్రానిక్‌ వస్తువులను తప్పక ఛార్జ్‌ చేస్తూండాలి. కాగా సింగపూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలతో భవిష్యత్తులో ఈ ఛార్జింగ్‌ సమస్యకు వీడ్కోలు చెప్పవచ్చు. మన శరీరాన్నే వాహకంగా ఉపయోగించి స్మార్ట్‌వాచ్‌ లాంటి ఇతర వేయరబుల్స్ ను మొబైల్‌తో, ఇతర ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లతో ఛార్జీంగ్‌ చేయవచ్చునని పరిశోధకులు వెల్లడించారు.

నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ (ఎన్‌యూఎస్‌)కు చెందిన డిపార్టమెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఈ టెక్నిక్‌ను ఆవిష్కరించింది. బాడీ కపుల్డ్‌ ట్రాన్స్‌మిషన్‌ ద్వారా మన దగ్గరలో ఉన్న ఎలక్ట్రానిక్‌ వస్తువుల ద్వారా మనం ధరించిన స్మార్ట్‌ వాచ్‌లను సులువుగా ఛార్జ్‌ చేయవచ్చునని పరిశోధకులు తెలిపారు. 

బాడీ కపుల్డ్‌ ట్రాన్స్‌మిషన్‌ అంటే ఏమిటి..?
మమూలుగా మన చుట్టూ ఉన్న ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఎంతోకొంత ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ క్షేత్రాన్ని సృష్టిస్తాయి. ఈ క్షేత్రాలనుపయోగించి మన శరీరంలో ఏర్పాటుచేసిన రిసీవర్‌, ట్రాన్స్‌మీటర్‌తో ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు, (స్మార్ట్‌ వాచ్‌, ఇయర్‌ బడ్స్‌)లాంటి బ్యాటరీలను చార్జ్‌ చేయవచ్చును.
ఫోటో కర్టసీ: నేచర్ ఎలక్ట్రానిక్స్
ఫోటో కర్టసీనేచర్ ఎలక్ట్రానిక్స్

చదవండి: ఇతర గ్రహలకు జీవుల రవాణా మరింత ఈజీ కానుందా..!

మరిన్ని వార్తలు