నెలకు రూ.4 లక్షలు: రెండేళ్లు కష్టపడితే, కోటి...కానీ..!

20 Feb, 2023 20:48 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం భయాలతో గ్లోబల్‌గా ఉద్యోగాలు ఊడిపోతున్న తరుణంలో ఒక ఆసక్తికర పరిణామం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. అదేంటి అంటే.. నెలకు నాలుగు లక్షల రూపాయల వేతనాన్ని ఆఫర్‌ చేస్తున్నా అబెర్డీన్ తీరంలో ఉత్తర సముద్రంలో ఆఫ్‌షోర్ రిగ్గర్ ఉద్యోగానికి అప్లయ్‌ చేసుకునే నాధుడే దాదాపు కనిపించడం లేదట.

విషయం ఏమిటంటే స్కాట్లాండ్‌లో  ఈ ఉద్యోగం. అబెర్డీన్‌లోని నార్త్ సీ తీరంలో పనిచేయాల్సి ఉంటుంది సముద్రంలోని నిర్దిష్ట ప్రాంతంలో ఏర్పాటైన రిగ్‌లో ఆఫ్‌షోర్ రిగ్గర్ అభ్యర్థి సముద్రగర్భం నుంచి ఖనిజ నిల్వలను అన్వేషించడం, వెలికితీయడం, ఆయిల్ వెలికితీయడం వంటివి చేయాల్సి ఉంటుంది.  ప్రధానంగా టెక్నికల్ అండ్ సేఫ్టీ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి. BOSIET (బేసిక్ ఆఫ్‌షోర్ సేఫ్టీ ఇండక్షన్ అండ్ ఎమర్జెన్సీ ట్రెనింగ్), FOET (ఫ‌ర్దర్‌ ఆఫ్‌షోర్ ఎమర్జెన్సీ ట్రెనింగ్), CA-EBS (కంప్రెస్డ్ ఎయిర్ ఎమర్జెన్సీ బ్రీతింగ్ సిస్టమ్), OGUK మెడికల్ ట్రైనింగ్ వంటివి శిక్షణ పొంది ఉండాలి. ఉద్యోగికి సెలెక్ట్‌ అయితే రోజుకు 12 గంటల పని. రోజుకు రూ.36 వేల  చొప్పున  నెలకు రూ.4 లక్షలు జీతం చెల్లిస్తారు. ఒక షిప్ట్‌ ఒకటి నుండి ఆరు నెలల వరకు ఉంటుంది.

కంపెనీ పాలసీ ప్రకారం ప్రోత్సాహకాలు,సెలవులు కూడా ఉంటాయి. వారం రోజులు సీక్‌ లీవ్‌ కూడా ఉంది. అభ్యర్థి రెండేళ్ల పాటు ఉద్యోగంలో ఉండి, 6-6 నెలల 2 షిఫ్ట్‌లను పూర్తి చేస్తే, అప్పుడు జీతం £95,420 (రూ. 1 కోటి)కి చేరుకుంటుంది.  ఇంత భారీ ప్యాకేజీతో మొత్తం 5 ఖాళీలకుగాను 24 రోజుల క్రితం నోటిఫికేషన్‌ ప్రకటించగా అప్లయ్‌ చేసుకున్న వారి సంఖ్య చాలా తక్కువట. తన ఖచ్చితమైన గుర్తింపును వెల్లడించకుండానే ఎనర్జీ మార్కెట్లో పెద్ద కంపెనీగా చెప్పుకున్న సంస్థ ఈ ప్రకటన ఇచ్చింది.

మరిన్ని వార్తలు