వరల్డ్‌ వైడ్‌గా స్తంభించిన గూగుల్ సేవలు..! ట్విట్టర్‌లో యూజర్ల అరాచకం..!

9 Aug, 2022 08:10 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం నుంచి గూగుల్‌ వెబ్‌ సైట్‌ ఓపెన్‌ కాలేదు. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌తో పాటు జీమెయిల్‌ సర్వీస్‌, యూట్యూబ్‌,గూగుల్‌ మ్యాప్స్‌ సైతం పనిచేయడం లేదంటూ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గూగుల్‌లో సెర్చ్‌ చేసే సమయంలో గూగుల్‌ సర్వర్‌లో 502 ఎర్రర్‌ డిస్‌ప్లే అవుతుంది. టెంపరరీగా ఆగిపోవడంతో పాటు ప్లీజ్‌ ట్రై ఎగైన్‌ ఇన్‌ 30 సెకెండ్స్‌ అని చూపిస్తుంది. ఇంటర్నల్‌ సర్వర్‌లలో అంతరాయం ఏర్పడించింది. మీ రిక్వెస్ట్‌ను ప్రాసెసింగ్‌ చేస్తున్నాం అంటూ రిప్లయి రావడంపై యూజర్లు..గూగుల్‌కు మెయిల్స్‌ పెడుతున్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో వెంటనే సమస్యని పరిష్కరించాలని కోరుతున్నారు.  

అదే సమయంలో దేశ వ్యాప్తంగా గూగుల్‌ ట్రెండ్స్‌ కూడా పనిచేయడం లేదని తెలుస్తోంది. గూగుల్‌ ట్రెండ్స్‌ విభాగం ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. అందులో బ్లాంక్‌ పేజ్‌ కనిపించడంతో భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన యూజర్లు..గూగుల్‌ పనిచేయడం లేదంటూ ఆ సంస్థకు వరుస ట్వీట్‌లు చేస్తున్నారు. కొంత యూజర్లు ఏకంగా గూగుల్‌ను వదిలేసి ట్విట్టర్‌ను వినియోగిస్తామంటూ ట్వీట్‌ చేస్తున్నారు. మీమ్స్‌ వేస్తున్నారు. ప్రస్తుతం ఆ మీమ్స్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుండగా అవి మీకోసం.  

మరిన్ని వార్తలు