సెబీ షాక్‌: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు

1 Jun, 2023 13:38 IST|Sakshi

న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులు, సెక్యూరిటీలను దుర్వినియోగం చేసినందుకు గాను బ్రోకరేజ్‌ సంస్థ కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ (కేఎస్‌బీఎల్‌) రిజిస్ట్రేషన్‌ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రద్దు చేసింది. కేఎస్‌బీఎల్‌ క్లయింట్ల నిధులను గ్రూప్‌ కంపెనీల ఖాతాల్లోకి బదిలీ చేసుకుందని, అలాగే రూ. 2,700 కోట్ల విలువ చేసే క్లయింట్ల సెక్యూరిటీలను తనఖా పెట్టి దాదాపు రూ. 2,033 కోట్ల నిధులు సేకరించిందని బుధవారం జారీ చేసిన ఆదేశాల్లో సెబీ పేర్కొంది.

ఇదీ చదవండి:  అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్‌, నెట్‌వర్త్‌ గురించి తెలుసా?

ఆయా క్లయింట్లకు నిధులు, సెక్యూరిటీలను తిరిగి ఇవ్వకపోగా.. ఖాతాల మదింపు విషయంలో ఫోరెన్సిక్‌ ఆడిటర్లకు సరిగ్గా సహకరించలేదని కూడా తెలిపింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు ఇప్పటికే కేఎస్‌బీఎల్‌ను డిఫాల్టరుగా ప్రకటించి, బహిష్కరించిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు సెబీ పేర్కొంది. క్లయింట్ల నిధులను దుర్వినియోగం చేసినందుకు గాను కార్వీ, దాని ప్రమోటర్‌ కొమండూర్‌ పార్థసారథి ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్‌ మార్కెట్‌ లావాదేవీలు జరపకుండా సెబీ గత నెలలో నిషేధం విధించింది.

(రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్‍ క్వీన్‌, ఆ నిర్మాత ఇంటిపక్కనే!)

ఇలాంటి మరిన్ని బిజినెస్‌వార్తలు, ఇతరఅప్‌డేట్స్‌ కోసం చదవండి సాక్షిబిజినెస్‌ 

మరిన్ని వార్తలు