దివాలా సంస్థల్లో షేర్‌ హోల్డర్లకు రక్షణగా సెబీ కీలక నిర్ణయం

11 Nov, 2022 07:50 IST|Sakshi

న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్న లిస్టెడ్‌ కంపెనీల షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను కాపాడటంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నిర్దిష్ట ఫ్రేమ్‌వర్క్‌కు సంబంధించిన చర్చాపత్రాన్ని రూపొందించింది. 

కంపెనీని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చే రిజల్యూషన్‌ దరఖాస్తుదారుకు ఇచ్చే అవకాశాలనే మైనారిటీ షేర్‌హోల్డర్లకు కూడా కల్పించాలని  ప్రతిపాదించింది. 

దీని ప్రకారం కొత్త సంస్థలో కనీస పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ శాతాన్ని (ప్రస్తుతం 25 శాతం) కొనుగోలు చేసేందుకు ప్రస్తుత పబ్లిక్‌ ఈక్విటీ షేర్‌హోల్డర్లకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది. రిజల్యూషన్‌ దరఖాస్తుదారు విషయంలో అంగీకరించిన ధరపరమైన నిబంధనలే వారికీ వర్తింపచేయాలని సూచించింది. దీనితో పాటు ఇతరత్రా పలు ప్రతిపాదనలున్న చర్చాపత్రంపై సంబంధిత వర్గాలు నవంబర్‌ 24లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది.   

మరిన్ని వార్తలు