ఐపీవోకు రెండు కంపెనీలు రెడీ

1 Mar, 2022 08:45 IST|Sakshi

జేకే ఫైల్స్, ఎలిన్‌ ఎల్రక్టానిక్స్‌ సెబీ నుంచి తాజాగా గ్రీన్‌సిగ్నల్‌  

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూలు చేపట్టేందుకు తాజాగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రెండు కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచి్చంది. ఈ జాబితాలో టెక్స్‌టైల్స్‌ రంగ దిగ్గజం రేమండ్‌ ప్రమోట్‌ చేసిన జేకే ఫైల్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌తోపాటు ఎలిన్‌
ఎలక్ట్రానిక్స్‌ చేరింది. ఐపీవోకు వీలుగా 2021 నవంబర్, డిసెంబర్‌లలో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. 

రూ. 800 కోట్ల ఇష్యూ 
జేకే ఫైల్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 800 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళికలు వేసింది. ఇందుకు అనుగుణంగా ప్రమోటర్‌ కంపెనీ రేమండ్‌ లిమిటెడ్‌ తగినన్ని ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రస్తుతం జేకే ఫైల్స్‌లో రేమండ్‌కు 100 శాతం వాటా ఉంది. కంపెనీ ప్రెసిషన్‌ ఇంజినీర్డ్‌ విడిభాగాలను రూపొందిస్తోంది.  

రూ. 760 కోట్లపై కన్ను 
ప్రధాన బ్రాండ్లకు లైటింగ్స్, ఫ్యాన్లు, చిన్న కిచెన్‌ అప్లయెన్సెస్‌ తదితరాలను తయారు చేసి అందిస్తున్న ఎలిన్‌ ఎల్రక్టానిక్స్‌ ఐపీవో ద్వారా రూ. 760 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసిన వాటాదారు సంస్థలు రూ. 585 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్‌ చేయనుండగా.. కంపెనీ మరో రూ. 175 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది.   

మరిన్ని వార్తలు