Co-Location Scam: చిత్ర రామకృష్ణకు సెబీ భారీ షాక్‌!

29 Jun, 2022 09:27 IST|Sakshi

సెక్యూరిటీ అండ్‌ ఎక్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ)కీ, ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చిత్ర రామకృష్ణకు భారీ షాకిచ్చింది.  ఎన్‌ఎస్‌ఈలో జరిగిన అవకతవకలపై కేసు దర్యాప్తు జరుగుతుండగా..సెబీ ఆమెకు ఫైన్‌ విధించింది.   

ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణ రోజు రోజుకి మరింత కష్టాల్లో చిక్కుకుంటున్నారు. ఎన్‌ఎస్‌ఈలో సీఈవోగా విధులు నిర్వహించే సమయంలో అవకతవకలకు పాల్పడినట్లు పలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి అమెపై కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులో సెబీ..ఎన్‌ఎస్‌ఈకీ రూ.7 కోట్లు, చిత్ర రామకృష్ణ రూ5కోట్లు, ఆనంద్‌ సుబ్రమణియన్‌కు రూ.5కోట్లు, వే 2 హెల్త్‌ బ్రోకర్‌కు రూ.6కోట్లు ఫైన్‌ విధించింది.  

అంతా యోగి మహిమ
చిత్రా రామకృష్ణ ఎన్‌ఎస్‌ఈలో సీఈవోగా విధులు నిర్వహించే సమయంలో ఆమె ఓ హిమాలయ యోగి ఆదేశాల మేరకు పనిచేశారని, కీలక సమాచారాన్ని లీక్‌ చేశారని,అనర్హులకు పదవులిచ్చారని పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేస్తున్న విషయం తెలిసిందే.

చదవండి👉 'చిత్ర' విచిత్రమైన కథ..ఆ 'అజ్ఞాత' యోగి కేసులో మరో ఊహించని మలుపు!!

మరిన్ని వార్తలు