రాణా కపూర్‌కు సెబీ జరిమానా

8 Sep, 2022 06:22 IST|Sakshi

45 రోజుల్లోగా రూ. 2 కోట్లు చెల్లించాలి

న్యూఢిల్లీ: అదనపు టైర్‌(ఏటీ)–1 బాండ్ల విక్రయంలో అక్రమాలపై యస్‌ బ్యాంక్‌ మాజీ ఎండీ, సీఈవో రాణా కపూర్‌కు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 2 కోట్ల జరిమానా విధించింది. 45 రోజుల్లోగా జరిమానా చెల్లించవలసిందిగా ఆదేశించింది. యస్‌ బ్యాంకు అధికారులు రిటైల్‌ ఇన్వెస్టర్లకు తప్పుడు పద్ధతిలో అదనపు టైర్‌–1 బాండ్లను విక్రయించడంపై సెబీ తాజా జరిమానాకు తెరతీసింది.

సెకండరీ మార్కెట్‌లో ఏటీ–1 బాండ్లను విక్రయించేటప్పుడు బ్యాంకు, కొంతమంది అధికారులు రిస్కులను ఇన్వెస్టర్లకు వెల్లడించకపోవడాన్ని సెబీ తప్పుపట్టింది. 2016లో ప్రారంభమైన ఏటీ–1 బాండ్ల అమ్మకం 2019వరకూ కొనసాగింది. వీటి విక్రయ వ్యవహారాన్ని మొత్తంగా కపూర్‌ పర్యవేక్షించినట్లు సెబీ పేర్కొంది. బాండ్ల విక్రయంపై సభ్యుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందడంతోపాటు అమ్మకాలను పెంచేందుకు అధికారులపై ఒత్తిడిని సైతం తీసుకువచ్చినట్లు తెలియజేసింది.

మరిన్ని వార్తలు