ఒక్క రోజులో రూ. 38 వేల కోట్ల సందప ఆవిరి.. పేటీఎం లిస్టింగ్‌పై సెబీ విచారణ?

20 Nov, 2021 20:06 IST|Sakshi

దేశం చరిత్రలోనే అతిపెద్ద ఇన్షియల్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో)గా వార్తల్లోకెక్కిన పేటీఎం చివరకు దారుణ ఫలితాలను అందించింది. లిస్టింగ్‌ రోజు దారుణంగా షేరు ధర క్షీణించడంతో ముదుపరులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా ఈ పరిణామాలపై సెబీ దృష్టి సారించింది.

విజయ్‌ శేఖర్‌ శర్మ ఫౌండర్‌గా ఉన్న పేటీఎం సంస్థ ఇటీవల పబ్లిక్‌ ఇష్యూకి వచ్చింది. ఒక్కో షేరు ధర 2150గా ఐపీవో ప్రారంభమైంది. ఆ తర్వాత లిస్టింగ్‌ మొదలైన కాసేపటికే ఒక​‍్కసారిగా షేరు ధర పడిపోవడం మొదలైంది. లిస్టింగ్‌ మొదలైన రెండు గంటలకే షేరు ధర పది శాతానికి పైగా క్షీణించింది. మొదటి రోజు మార్కెట్‌ ముగిసే సమయానికి రికార్డు స్థాయిలో షేరు దర 27 శాతం క్షీణించింది. గత పదేళ్లలో లిస్టింగ్‌ తొలిరోజే ఓ పెద్ద కంపెనీ షేరు విలువ ఈ స్థాయిలో పడి పోవడం జరగలేదు. ఈ ఘటనతో ఒక్క రోజులోనే ఏకంగా 38 వేల కోట్ల సందప హరించుకుపోయింది.

దీంతో పేటీఎం ఐపీవో విషయంలో ఏం జరిగిందనే అంశంపై సెబీ విచారణకు సిద్ధమైంది. పేటీఎం ఐపీవోని నిర్వహించిన ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లను విచారించాలని నిర్ణయించింది. ఐపీవోకి అనుమతి ఇచ్చినప్పటి నుంచి లిస్టింగ్‌ వరకు ఏం జరిగిందనే దానిపై కూలంకషంగా విచారణ జరపనుంది. బ్యాంకర్లు కానీ లేదా ప్రమోటర్లు కానీ ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా నెగటివ్‌ ప్రచారం చేశారా అన్న కోణంలో సెబి విచారణ సాగనుంది.

చదవండి:జాతీయ గీతం వింటూ కన్నీరు పెట్టుకున్న విజయ్‌ శేఖర్‌ శర్మ!

మరిన్ని వార్తలు