సహారా రియల్టీకి సెబీ షాక్‌!

27 Dec, 2022 17:37 IST|Sakshi

బ్యాంక్‌ ఖాతాల అటాచ్‌మెంట్‌

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా సహారా గ్రూప్‌ రియల్టీ కంపెనీ, సంస్థ చీఫ్‌ సుబ్రతా రాయ్, తదితరుల బ్యాంకు, డీమ్యాట్‌ ఖాతాల అటాచ్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఐచ్చికంగా పూర్తి మార్పిడికి వీలయ్యే డిబెంచర్ల(ఓఎఫ్‌సీడీలు) జారీలో నిబంధనల ఉల్లంఘనపై రూ. 6.42 కోట్ల రికవరీకిగాను సెబీ చర్యలు తీసుకుంది.

ఈ జాబితాలో సహారా ఇండియా రియల్‌ ఎస్టేట్‌(సహారా కమోడిటీ సర్వీసెస్‌) కార్పొరేషన్, సుబ్రతా రాయ్, అశోక్‌ రాయ్‌ చౌధరీ, రవి శంకర్‌ దూబే, వందనా భార్గవ ఉన్నారు. వీరి నుంచి వడ్డీ, వ్యయాలు, ఇతర ఖర్చులతో కలిపి రూ.6.42 కోట్ల రికవరీకి సెబీ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యక్తులు, సంస్థకు సంబంధించిన ఎలాంటి డెబిట్లను అనుమతించవద్దంటూ బ్యాంకులు, డిపాజిటరీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌కు నోటీసు ద్వారా తెలియజేసింది. కేవలం క్రెడిట్లకు అనుమతించింది. అంతేకాకుండా ఈ డిఫాల్టర్లకు చెందిన లాకర్లతోసహా అన్ని ఖాతాలనూ అటాచ్‌ చేయమంటూ అన్ని బ్యాంకులనూ ఆదేశించింది.

చదవండి: Meesho Shopping Survey: ఆన్‌లైన్‌ షాపింగ్‌ అంటే ఆ ఒక్కరోజే, ఎగబడి కొనేస్తున్నారు!

మరిన్ని వార్తలు