కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ ప్రమోటర్లపై సెబీ జరిమానా

22 Oct, 2020 09:42 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, సాధారణ షేర్‌హోల్డర్లను మోసగించారని ఆరోపణలపై కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ (కేబీఎల్‌) ప్రమోటర్లు, ఇతరులపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 31 కోట్ల జరిమానా విధించింది. అలాగే వీరు మూడు నుంచి ఆరు నెలల పాటు క్యాపిటల్‌ మార్కెట్‌ లావాదేవీలు జరపరాదంటూ ఆదేశించింది. అనుచితంగా ఆర్జించిన రూ. 16.6 కోట్ల లాభాలను 4 శాతం వడ్డీ రేటు, రూ. 14.5 కోట్ల పెనాల్టీతో పాటు మొత్తం రూ. 31.21 కోట్లు కట్టాలంటూ సెబీ ఆదేశాలు ఇచ్చింది. తమ దగ్గరున్న కీలక సమాచారాన్ని ఉపయోగించుకుని షేర్లలో లావాదేవీలు జరపడం ద్వారా కేబీఎల్‌ ప్రమోటర్లు, డైరెక్టర్లు లబ్ధి పొందారని విచారణలో వెల్లడైంది.
 

మరిన్ని వార్తలు