లేటెస్ట్‌ టెక్నాలజీతో సెబీ రెడీ

12 Jul, 2022 00:52 IST|Sakshi

ఇన్‌సైడర్‌ కేసులపై కొరడా

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అత్యంత ఆధునిక టెక్నాలజీని, సంబంధిత టూల్స్‌ను సమకూర్చుకుంటోంది. వీటి సహాయంతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, అక్రమ లావాదేవీల కేసులపై కొరడా ఝళిపించనుంది. తద్వారా నకిలీ ఖాతాల వినియోగంతో అక్రమాలకు పాల్పడిన కేసులను అత్యంత భారీ స్థాయిలో వెలికితీయనుంది. వెరసి క్యాపిటల్‌ మార్కెట్లు, కార్పొరేట్‌ ప్రపంచంలో పేరున్న ఇలాంటి కొంతమంది ప్రధాన అక్రమార్కులపై కేసులు నమోదు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

కోవిడ్‌–19వల్ల తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఈ తరహా కేసులపై ఇటీవల సెబీ పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ బాటలో ఇకపై ఇలాంటి కేసులను మరిన్నింటిని గుర్తించనున్నట్లు తెలుస్తోంది. ఆధునిక టెక్నాలజీతో పర్యవేక్షణ వ్యవస్థల సామర్థ్యం 100 రెట్లు బలపడిన కారణంగా సెబీ మరింతలోతైన అధ్యయానికి తెరతీస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఆల్గోరిథమ్స్, బిగ్‌ డేటా, కృత్రిమ మేథ తదితర టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు
వివరించాయి.

మరిన్ని వార్తలు