అదానీ రుణాలపై సెబీ కన్ను, ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్లకు మరో 51 వేల కోట్ల షాక్‌

22 Feb, 2023 15:33 IST|Sakshi

సాక్షి, ముంబై: అదానీ గ్రూపులో అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌  హిండెన్‌బర​్‌ రేపిన మరింత ముదురు తోంది.  వికీపీడియా సంస్థ ఆరోపణల దుమారానికి తోడు తాజాగా మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) క్రెడిట్ రేటింగ్ సంస్థల నుండి అదానీ గ్రూప్ కంపెనీల స్థానిక రుణాలు, సెక్యూరిటీల అన్ని రేటింగ్‌ల వివరాలను కోరినట్టు నివేదికల ద్వారా తెలుస్తోంది.

సెబీ అదానీ సంస్థల రుణాల రేటింగ్‌లపై సమాచారాన్ని కోరిందంటూ ఎకనామిక్ టైమ్స్ నివేదించిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. తీవ్ర అమ్మకాలతో ఇన్వెస్టర్లు ఏకంగా  రూ. 51,000 కోట్లు నష్టపోయారు. బుధవారం  నాటి నష్టాల మార్కెట్‌లో  అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు 9.55 శాతం క్షీణించగా, అదానీ పోర్ట్స్ షేరు 4.66 శాతం కుప్పకూలాయి.  ఇంకా అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు ఒక్కొక్కటి 5 శాతం పడిపోయాయి. గత రెండు వారాల్లో అత్యంత దారుణ పతనాన్ని బుధవారం చవిచూశాయి. అదానీ గ్రూప్ సంస్థలు మ్యూచువల్ ఫండ్స్‌కు ముందస్తు చెల్లింపులు చేస్తున్నప్పటికీ స్టాక్ పతనం కొనసాగుతోంది.

గత రెండు రోజులుగా, కమర్షియల్ పేపర్‌లకు సంబంధించిన ఫిబ్రవరి బకాయిల కోసం SBI MF, HDFC MF & ABSL MFలకు ముందస్తు చెల్లింపులు జరిగాయి.  అలాగే మార్చి బకాయిలకు ముందస్తు చెల్లింపును కూడా ప్రకటించింది. అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ బాండ్ హోల్డర్‌లకు కొన్ని వారాల్లో రుణ రీఫైనాన్సింగ్ ప్లాన్‌లను ప్రకటిస్తామని కూడా అదానీ  ప్రకటించింది. పలు అదానీ కంపెనీల స్టాక్ ధరలు భారీగా పతనంతో  లిక్విడిటీ పొజిషన్లు, రుణాలు తీసుకున్న కంపెనీల రుణ చెల్లింపు సామర్థ్యంపై ఏమైనా ప్రభావం ఉంటుందా లేదా అని నిర్ధారించడానికి సెబీ బహుశా ప్రయత్నిస్తోందట.

కాగా హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు అదానీ గ్రూపు తత్రీవంగా ఖండించినప్పటికీ ఈ వివాదం ఇంకా సమసి పోక ముందే వికిపీడియా ఎంట్రీలను తమకు అనుకూలంగా మార్చుకున్నారని వికిపీడియా స్వతంత్ర వార్తాపత్రిక సైన్ పోస్ట్ ఆరోపించింది.పెయిడ్ ఎడిటర్లను పెట్టి తమ గ్రూప్‌నకు అనుకూలంగా వ్యాసాలు రాయించుకున్నారని  వాదించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు