NSE: మాజీ చీఫ్‌ నారాయణ్‌కు ఊరట

7 May, 2022 11:01 IST|Sakshi

సెబీ ఆదేశాలపై స్టే జారీ చేసిన శాట్‌ 

న్యూఢిల్లీ: ఎన్‌ఎస్‌ఈ పరిపాలన నిర్వహణ లోపాలకు సంబంధించిన కేసులో ఆ సంస్థ మాజీ చీఫ్‌ రవి నారాయణ్‌కు శాట్‌లో ఊరట లభించింది. రవి నారాయణ్‌కు వ్యతిరేకంగా సెబీ ఇచ్చిన ఆదేశాలపై సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) స్టే విధించింది. అది కూడా నాలుగు వారాల్లోపు సెబీ వద్ద రూ.50 లక్షలు డిపాజిట్‌ చేయాలని, ఈ షరతుకు లోబడే తమ ఉత్తర్వుల అమలు ఆధారపడి ఉంటుందన్న షరుతు విధించింది. 

రవి నారాయణ్‌ ఎన్‌ఎస్‌ఈ సీఈవోగా 2013 మార్చి 31 వరకు పనిచేశారు. 2013 ఏప్రిల్‌ నుంచి 2017 జూన్‌ వరకు ఎన్‌ఎస్‌ఈ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌కు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, వైస్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో ఎన్‌ఎస్‌ఈలో చోటుచేసుకున్న పరిణామాలకు రవి నారాయణ్‌ను బాధ్యుడ్ని చేస్తూ సెబీ ఫిబ్రవరి 11న ఆదేశాలు జారీ చేసింది. సెబీ నమోదిత ఇంటర్‌ మీడియరీలు, ఏదేనీ మార్కెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్‌స్టిట్యూషన్‌తో భాగస్వామి కాకుండా రెండేళ్లపాటు ఆయనపై నిషేధం విధించింది. అలాగే రూ.2 కోట్ల పెనాల్టీ కట్టాలని కూడా ఆదేశించింది. దీనిపై నారాయణ్‌ శాట్‌ను ఆదేశించారు. 

నారాయణ్‌ నుంచి ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో బాధ్యతలను చేపట్టిన చిత్రా రామకృష్ణ.. అర్హతలు లేకపోయినా భారీ వేతనానికి వ్యక్తిగత సలహాదారుగా ఆనంద్‌ సుబ్రమణియన్‌ను నియమించినట్టు సెబీ గుర్తించింది. అంతేకాదు, సుబ్రమణియన్‌కు పెద్ద ఎత్తున అధికారాలను చిత్రా కట్టబెట్టినట్టు సెబీ తన ఆదేశాల్లో పేర్కొనడం గమనార్హం.   
చదవండి: మిస్టర్‌ ఆనంద్‌ సుబ్రమణియన్‌ రూ.2.05 కోట్లు కట్టండి.. లేదంటే?

మరిన్ని వార్తలు