గిన్నిస్ రికార్డు నెలకొల్పిన కియా ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ ఎంతో తెలుసా?

21 Nov, 2021 19:08 IST|Sakshi

ప్రముఖ సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ప్రపంచంలో తన సత్తా చాటేందుకు సిద్దం అయ్యింది. తన కొత్త తరం ఎలక్ట్రిక్ కారు కియా ఈవీ6ను 2021 లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆటో షోలో విడుదల చేసింది. ఈ కారు 2022 క్యూ1లో యుఎస్ మార్కెట్లోకి రానున్నట్లు తెలిపింది. ఈవీ6ను మొత్తం 50 రాష్ట్రాలలో తీసుకొని రానున్నారు. అయితే, అరంగేట్రానికి ముందు కియా అధికారికంగా తన కాన్సెప్ట్ ఈవీ6 టీజర్ చిత్రాన్ని విడుదల చేసింది. ఈ ఎస్‌యువి కారు విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. ఈ కియా ఈవీ6 ఫస్ట్ ఎడిషన్ లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ 77.4 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో 300 మైళ్లు(సుమారు 482.803 కిమీ) రేంజ్ వరకు ఇస్తుంది. 

దీని ధరను 58,500 డాలర్లు(సుమారు రూ.43 లక్షలు)గా నిర్ణయించారు. ఈ ఎలక్ట్రిక్ కారు ఎస్‌యువి 400వీ,  800వీ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ కారును ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో 5 నిమిషాలు చార్జ్ చేస్తే ఈవీ6 112 కిలోమీటర్లు, 18 నిమిషాలు చార్జ్ చేస్తే 330 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు అని కియా పేర్కొంది. కియా కొత్త ఈవీ6 డిజైన్ చూస్తే సరికొత్తగా ఉంది. ఈవీ కారు ఫ్లాట్ రూఫ్ లైన్, పెద్ద వీల్ ఆర్చ్, స్లిమ్ ఎల్ఈడి డిఆర్ఎల్ సెక్షన్, ప్రముఖ ఫ్రంట్ గ్రిల్ తో వస్తుంది. ఛార్జింగ్ పరంగా చూస్తే ఈ కారు కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కెనడాకు చెందిన కియా ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. కెనడాలో ప్రత్యేకంగా ఈవీ6 కోసం కంపెనీ ఇప్పటికే సుమారు 2,000 ఆర్డర్లు అందుకున్నట్లు తెలిపింది. దక్షిణ కొరియా, ఐరోపాలో అమ్మకాలు ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభమయ్యాయి.
(చదవండి: 18 కోట్ల పంజాబ్‌ నేనల్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు భారీ షాక్!)

>
మరిన్ని వార్తలు