జపాన్‌ తరహా పాడ్‌ రూమ్స్‌ ఇప్పుడు భారత్‌లో..!

17 Nov, 2021 20:47 IST|Sakshi

భారతీయ రైల్వేస్‌ ప్రయాణికులకు అద్బుతమైన, విలాసవంతమైన ప్రయాణాలను అందించడం కోసం రకరకాల సౌకర్యాలను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకుగాను పలు రైల్వే స్టేషన్లలో ఎన్నో వసతులను రైల్వే శాఖ ఏర్పాటు చేస్తోంది. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడం కోసం పలు రైల్వే స్టేషన్లలో వెయింటింగ్‌ హాల్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఏసీ, నాన్‌ ఏసీ వంటి హాల్స్‌ను ప్రయాణికులకు రైల్వే శాఖ అందుబాటులో ఉంచుతుంది. 

తాజాగా ముంబై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల కోసం ఆధునాథన ‘పాడ్‌ రూమ్స్‌’ను భారతీయ రైల్వేస్‌ నిర్మించింది. రైల్వే, బొగ్గు  గనుల శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ పాటిల్ దాన్వే నవంబర్‌ 17న ప్రారంభించారు ముంబై సెంట్రల్‌ స్టేషన్‌లోని మొదటి అంతస్తులో ఈ అర్భన్‌ పాడ్‌ రూమ్‌ హోటల్‌ను నిర్మించింది. కాగా పాడ్‌ హోటల్స్‌కు సంబంధించిన ఫోటోలను రైల్వే మంత్రిత్వశాఖ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. 
చదవండి: ఐరన్‌ మ్యాన్‌ కలను నిజం చేసిన ఆనంద్‌ మహీంద్రా

పాడ్‌ హోటల్స్‌ అంటే..!
పాడ్‌ హోటల్స్‌ జపాన్‌లో అత్యంత ప్రాచుర్యాన్ని పొందాయి. జపాన్‌లో వీటిని క్యాప్సూల్స్‌ హోటల్స్‌గా పిలుస్తుంటారు. ఈ హోటల్స్‌లో ప్రయాణికులకు హలీవుడ్‌ సినిమా రేంజ్‌ ఇంటీరియర్స్‌ను ఏర్పాటు చేశారు. పాడ్‌ హోటల్స్‌లో వ్యక్తిగత సేఫ్‌లను కూడా ప్రయాణికులు పొందవచ్చును.  ఇందులో ప్రయాణికులు రాత్రివేళల్లో బస చేసే విధంగా గదులను ఏర్పాటు చేశారు. హోటల్‌ ప్రాంగణంలో ఉచిత వైఫై సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ హోటల్‌ గదులలో ఏసీ, టెలివిజన్‌, మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్‌, రీడింగ్‌ లైట్స్‌ మరెన్నో సదుపాయాలను ఏర్పాటుచేశారు. 

ఛార్జీలు ఎంతంటే...!
ఈ హోటల్‌లో బస చేసే ప్రయాణికులకు 12 గంటలకు రూ.999, 24 గంటలకు 1,999 ఛార్జీలను రైల్వే శాఖ వసూలు చేయనుంది.  మహిళలు, వికలాంగుల కోసం ప్రత్యేక పాడ్‌లతో సహా 48 క్యాప్సూల్‌ లాంటి గదులను నిర్మించారు.


చదవండి: రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు..!

మరిన్ని వార్తలు