డబ్బులు పోయాయని కస్టమర్‌ కేర్‌ నెంబర్‌కు కాల్ చేస్తే.. రూ.12 లక్షలు మాయం!

16 Jan, 2022 14:59 IST|Sakshi

ముంబై: మీరు గూగుల్‌లో కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతికి కాల్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. లేకపోతే, నెరగాళ్ల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. గత కొద్ది రోజుల నుంచి సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకుల్ని టార్గెట్ చేసి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా రోజు రోజుకి కొత్త కొత్త పద్ధతిలో మోసాలకు చేస్తున్నారు. పోలీసులు, మీడియా ఎంత జాగ్రత్తగా ఉండాలని సూచించిన సైబర్ నేరాల రేటు పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌లో పిజ్జా, డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేస్తున్నప్పుడు తాను కోల్పోయిన డబ్బును తిరిగి పొందడానికి గూగుల్‌లో కనిపించిన కస్టమర్‌ కేర్‌ నెంబర్‌కు కాల్ చేస్తే ఒక సీనియర్ సిటిజన్ 11 లక్షలకు పైగా మోసపోయినట్లు ముంబై పోలీసులు నిన్న(జనవరి 15) తెలిపారు. 

వివరాల్లోకి వెళ్తే.. ముంబై నగరంలో అంధేరి ప్రాంతానికి చెందిన ఒక మహిళ గత ఏడాది జూలైలో ఆన్‌లైన్‌లో పిజ్జా ఆర్డర్ చేసింది. పిజ్జా ఆర్డర్ కోసం ఫోన్‌లో నుంచి డబ్బులు చెల్లించేటప్పుడు ఆమె రూ.9,999 కోల్పోయింది. అదేవిధంగా అక్టోబర్ 29న ఆన్‌లైన్‌లో డ్రై ఫ్రూట్స్ కోసం ఆర్డర్ చేస్తుండగా మళ్లీ రూ.1,496 నష్టపోయినట్లు ఆమె తెలిపారు. ఈ రెండు సందర్భాల్లో డబ్బులు పోవడంతో వాటిని తిరిగి పొందడం కోసం ఆ మహిళ గూగుల్‌లో కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతికి ఒక నెంబర్‌కు కాల్ చేసింది. ఆమెకు కాల్ చేసిన వ్యక్తి నిజమైన కంపెనీ కస్టమర్ కేర్ వ్యక్తిగా నటించాడు. 

ఆ నకిలీ వ్యక్తి డబ్బులు తిరిగి పొందటం కోసం మొబైల్ ఫోన్‌లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. ఆమె తను చెప్పిన విధంగానే చేసింది. కానీ, అది ఒక నకిలీ యాప్. ఆ యాప్‌లో నమోదు చేసిన ఖాతానెంబర్, పాస్వవర్డ్, ఓటీపీ వివరాలు అన్నీ మోసాగాళ్ల చేతకి చిక్కాయి. దీంతో రెచ్చిపోయిన మోసాగాళ్లు గత ఏడాది నవంబర్ 14 నుంచి డిసెంబర్ 1 మధ్య కాలంలో ఆ మహిళ బ్యాంకు ఖాతా నుంచి రూ.11.78 లక్షలు బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మోసం అంత సైబర్ పోలీస్ స్టేషన్ సంప్రదించినప్పుడు ఈ మోసం వెలుగులోకి వచ్చినట్లు ఆ అధికారి తెలిపారు. ఆమె చేసిన ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 420 ఇతర నిబంధనల కింద ఆ మోసాగాళ్ల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

(చదవండి: ఎలన్‌ మస్క్‌కి టాలీవుడ్‌ ప్రముఖుల రిక్వెస్ట్‌!)

మరిన్ని వార్తలు