పెట్టుబడుల వరద.. ‘సీనియర్‌ సిటిజన్‌’ ఇళ్లకు గిరాకీ

17 Nov, 2023 14:08 IST|Sakshi

వృద్ధుల నివాస విభాగంలో పెట్టుబడులకు భారీ అవకాశాలున్నట్టు జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది. వృద్ధ జనాభా దేశ జనాభాలో 2050 నాటికి 20 శాతానికి చేరుకుటుందన్న అంచనాలను ప్రస్తావించింది.

ప్రస్తుతం భారత్‌లో వృద్ధుల జనాభా (60 ఏళ్లుపైన ఉన్నవారు) 10 కోట్లుగా ఉందని, వీరికి సంబంధించి నివాస విభాగంలో ప్రాజెక్టుల అభివృద్ధి, పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని వెల్లడించింది. 

చిన్న కుటుంబాలు పెరుగుతుండడం, ఉద్యోగాల కోసం పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్సాల్సి వస్తుండడం.. పెద్దలకు ప్రత్యేక నివాసాల అవసరాన్ని పెంచుతున్నట్టు పేర్కొంది.

2050 నాటికి పెద్దలపై ఆధారపడిన పిల్లల సంఖ్యకు సమాంతరంగా, పిల్లలపై ఆధారపడే తల్లిదండ్రులూ ఉంటారని చెప్పింది. పెరిగే వృద్ధ జనాభాకు ప్రత్యేకమైన సంరక్షణ అవసరమవుతుందని వివరించింది. సాధారణ నివాసాలతో పోలిస్తే వృద్ధులకు సంబంధించి ఇళ్ల ధరలు 10–15 శాతం మేర భారత్‌లో అధికంగా ఉన్నట్టు పేర్కొంది. 

మరిన్ని వార్తలు