లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్‌: పీఎస్‌యూ బ్యాంకింగ్‌, మెటల్‌ బలహీనం

11 Jul, 2023 15:52 IST|Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు  లాభాల్లో ముగిసాయి.  కన్సాలిడేషన్ టోన్‌కు కొనసాగింపుగా,  రోజంతా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి.  లాభ నష్టాల మధ్య కదులాడుతూ  నిఫ్టీ రికార్డు గరిష్ట స్థాయిని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. చివర్లో లాభాల స్వీకరణ కనిపించింది. ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గినప్పటికీ చివరికి సెన్సెక్స్‌ 274  పాయింట్లు ఎగిసి  65,617 వద్ద,నిఫ్టీ  84  పాయింట్ల లాభంతో 19,448వద్ద ముగిసాయి. మెటల్ , PSU బ్యాంకులు మినహా అన్ని రంగాలలో కొనుగోళ్లు కనిపించాయి. ఆటో, పవర్, ఎఫ్‌ఎంసిజి, క్యాపిటల్ గూడ్స్,హెల్త్‌కేర్ ఒక్కొక్కటి 1 శాతం  లాభపడ్డాయి

సన్‌ఫార్మా, ఐషర్‌మోటార్స్‌, అపోలో హాస్పిటల్స్‌ , టాటా కన్జ్యూమర​్, మారుతి టాప్‌   గెయినర్స్‌గా నిలవగా,   యూపీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌సీఎల్‌ టెక్‌ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. 

అటు డాలరు మారకంలో రూపాయి కూడా లాభాలతో ముగిసింది.  సోమవారం నాటి ముగింపు 82.57తో పోలిస్తే డాలర్‌కు రూపాయి 21 పైసలు పెరిగి 82.36 వద్ద ముగిసింది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందించనున్న పూర్తి వీడియో చూడండి

మరిన్ని వార్తలు