లాభాల ముగింపు: 55,500 ఎగువకు సెన్సెక్స్‌ 

21 Jul, 2022 15:44 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభనష్టాలనుంచి కోలుకున్న సూచీలు చివరికి లాభాలను నిలుపుకున్నాయి. సెన్సెక్స్‌  284 పాయింట్ల లాభంతో 55681 వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 16605 వద్ద స్థిరపడింది. ఐటీ మినహియించి, దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ఫలితంగాసెన్సెక్స్‌  55500 పాయింట్లు  ఎగువన, నిఫ్టీ 16600 పాయింట్ల ఎగువన ముగియడం విశేషం.

ఇండస్‌ ఇండ్‌,  హిందాల్కో, టాటా, అపోలో హాస్పిటల్స్‌, అదానీ పోర్ట్స్‌, మారుతీ, భారతీ ఎయిర్‌టెల్ టాప్‌ గెయినర్స్‌గా ఉండగా, ఇన్పోసిస్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, టీసీఎస్,కోటక్ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ నష్టపోయాయి. మరోవైపు రూపాయి బలహీనత గురువారం కూడా కొనసాగింది. డాలరు మారకంలో  80.06 వద్ద  రికార్డు కనిష్టాన్ని తాకింది.  బుధవారం 79.98 వద్ద ముగిసిన రూపాయి గురువారం 79.95 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు