సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 320 పాయింట్లు లాభంతో 60,942 వద్ద, నిఫ్టీ 92 పాయింట్లు ఎగిసి 18,118 వద్ద స్థిరపడ్డాయి. ఆటో, బ్యాంక్, ఎఫ్‌ఎంసిజి, హెల్త్‌కేర్, ఆయిల్ & గ్యాస్ , ఐటీ షేర్లు లాభపడగా, రియల్టీ, పవర్ రంగ షేర్లు నష్టపోయాయి.
సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్ర, హిందాల్కో, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, యూపీఎల్, విప్రో టాప్ విన్నర్స్‌గా నిలవగా, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 33 పైసలు నష్టపోయి 81.39 వద్ద ఉంది.