లాభాల జోరు: వెలిగిపోయిన దలాల్‌ స్ట్రీట్‌

9 Jun, 2022 15:37 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆర్బీఐ పాలసీ  రివ్యూ తరువాత గురువారం ఆరంభంలో దాదాపు 300 కుప్పకూలిన సెన్సెక్స్‌ మిడ్‌ సెషన్‌నుంచి రీబౌన్స్‌ అయింది.   ఆటో,సిమెంట్‌ తప్ప దాదాపు అన్ని రంగాలు లాభపడ్డాయి. చివరికి సెన్సెక్స్‌ 428పాయింట్లు ఎగిసి 55320 వద్ద, నిఫ్టీ 122 పాయింట్లు లాభంతో​16478 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా సెన్సెక్స్‌ 55300, నిఫ్టీ 16,400  స్థాయిలకు ఎగువన ముగియడం విశేషం.

డా. రెడ్డీస్‌, ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ ఐషర్‌ మోటార్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ భారీ లాభాల్లో ముగిసాయి. మరోవైపు టాటా స్టీల్‌, శ్రీ సిమెంట్‌, టాటా మోటార్స్‌, గ్రాసిం, ఎన్టీపీసీ నష్టపోయాయి.  అటు అమెరికా డాలర్‌తో రూపాయి 13 పైసలు క్షీణించి ఇంట్రా-డే రికార్డు కనిష్ట స్థాయి 77.81ని టచ్‌ చేసింది. పెరిగిన ముడి చమురు ధరలు, ఎఫ్‌ఐఐల అమ్మకాల కారణంగా  రూపాయి 77.74 వద్ద ప్రారంభమైంది, ఆపై మరింత పడిపోయింది. బుధవారం నాటి 77.68 ముగింపుతో పోలిస్తే 13 పైసలు పతనమైంది. చివరకు 77.78 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు